మరో సినిమా అనౌన్స్ చేసిన సూర్య

Update: 2016-11-18 06:05 GMT
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ఎస్3 రిలీజ్ కి రెడీ అయిపోతోంది. సింగం సీక్వెల్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంపై.. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ బోలెడన్ని అంచనాలు ఉండగా.. డిసెంబర్ 16న థియేటర్లలోకి వచ్చేందుకు షెడ్యూల్ చేశారు. వెయ్యి.. ఐదొందల నోట్ల రద్దు వ్యవహారం కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నా.. ఇంకా నెల రోజుల గ్యాప్ ఉండడంతో.. అప్పటికి పరిస్థితులు చక్కబడతాయని ఆశిస్తున్నాడు సూర్య.

ఇప్పుడు సూర్య మరో ప్రాజెక్టు కూడా అనౌన్స్ చేసేశాడు. 'సెల్వ రాఘవన్ తో చేతులు కలుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్.ప్రభు నిర్మాతగా సూర్య36 తెరకెక్కనుంది' అంటూ ట్వీట్ చేసిన సూర్య.. ' సూర్య 36- ఎ సెల్వరాఘవన్ ఫిలిం'అంటూ ఓ లోగో టైపులో ఫోటో కూడా పోస్ట్ చేశాడు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేయడంతో.. డైరెక్టర్-నిర్మాత తేలిపోయినా.. మిగిలిన క్యాస్టింగ్ సంగతి తేలాల్సి ఉంది.

అయితే.. సూర్య నెక్ట్స్ ప్రాజెక్ట్ ఇది కాదు. దీని కంటే ముందు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో 'తానా సెర్నెధ కూటం' అంటూ మూవీ ప్రకటించగా.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుంది. వచ్చే ఏడాది జూలైలో రిలీజ్ చేయాలని భావిస్తుండగా.. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత.. సెల్వ రాఘవన్ మూవీ ప్రారంభించనున్నాడు సూర్య.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News