తెలుగులో రజినీకాంత్.. కమల్ హాసన్ ల తర్వాత అంతటి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో సూర్య. అతడి ప్రతి సినిమాకూ ఇక్కడ మంచి వసూళ్లే దక్కుతుంటాయి. సూర్య లాస్ట్ మూవీ ‘24’ తెలుగులో అనూహ్యమైన వసూళ్లు రాబట్టింది. అతడి లేటెస్ట్ మూవీ ‘ఎస్-3’కి కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇది సూర్యకు సంతోషాన్నిచ్చే విషయమే కానీ.. తన సొంతగడ్డ మీద మాత్రం అతడి ప్రభావం తగ్గిపోతోంది. ‘24’ సినిమాతో తెలుగులో హిట్టే. బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. అంచనాల్ని మించి ఆడింది. కానీ ఇలాంటి వైవిధ్యమైన సినిమాల్ని బాగా ఆదరించే తమిళ ప్రేక్షకులు దీనికి నిరాశాజనక ఫలితాన్ని కట్టబెట్టారు. అక్కడ ఆ చిత్రం ఫ్లాప్ అయింది.
ఐతే ‘సింగం’ సిరీస్ లో ఇంతకుముందు వచ్చిన రెండు సినిమాలూ తమిళంలో బ్లాక్ బస్టర్లు అయిన నేపథ్యంలో ‘ఎస్-3’ కూడా అలాంటి ఫలితాన్నే అందుకుంటుందని అనుకున్నారు. కానీ ఈ చిత్రానికి తమిళంలో ఆశించిన స్పందన రాలేదు. తమిళనాట నెలకొన్న విచిత్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జనాలు దీన్ని ఆదరించట్లేదో లేక సూర్య ఫాలోయింగ్ దెబ్బ తిందో.. కారణమేంటో కానీ.. ‘ఎస్-3’కి తమిళనాట ఆశించిన ఓపెనింగ్స్ రాలేదు. తెలుగు రాష్ట్రాల్లో తొలి మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.5.5 కోట్ల షేర్ రాబడితే.. తమిళనాట రూ.7.3 కోట్లే వచ్చాయి. మామూలుగా అయితే సూర్య సినిమాలకు తెలుగుతో పోలిస్తే రెండు మూడు రెట్లు ఎక్కువగానే వస్తాయి వసూళ్లు. కానీ ‘ఎస్-3’ కలెక్షన్లు మాత్రం చాలా నిరాశ కలిగిస్తున్నాయి. ఈ చిత్రానికి తమిళంలో రూ.60 కోట్ల దాకా బిజినెస్ జరిగింది. కానీ ఓపెనింగ్స్ చూస్తుంటే బయ్యర్లకు నష్టాలు తప్పేలా లేదు. తెలుగు ప్రేక్షకుల విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తూ వారి మనసులు గెలుస్తున్న సూర్య.. అర్జెంటుగా తన సొంతగడ్డ మీద కొంచెం దృష్టిపెట్టాల్సిన అవసరముందేమో.