ఫ్యామిలీ.. ఫ్యామిలీ సినిమాల్లోనే..

Update: 2018-04-25 23:30 GMT
కుటుంబంలో ఒకరో ఇద్దరో కాకుండా కుటుంబంలో ఉన్నవాళ్లంతా సినిమా రంగంలోకి వచ్చేస్తున్నారు. మన టాలీవుడ్ లో ఇదెప్పటి నుంచో ఉన్న ట్రెండే కదా అనిపిస్తోందా... టాలీవుడ్ లో ఉన్న ట్రెండ్ ఇప్పుడు కోలీవుడ్ కు వ్యాపించినట్టే కనిపిస్తోంది.

తమిళంలో పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివకుమార్. ఆయన ఇద్దరు కొడుకులూ హీరోలే. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన వాళ్లిద్దరూ సూర్య.. కార్తి. ఇప్పుడు కొత్తగా శివకుమార్ కుమార్తె బృంద సినిమాల్లోకి అడుగుపెడుతోంది. కాకపోతే యాక్టర్ గా కాదు... సింగర్ గా తొలి ప్రయత్నం చేస్తోంది. తమిళ్ హీరో కార్తీక్ కొడుకు గౌతమ్ హీరోగా నటిస్తున్న మిస్టర్ చంద్రమౌళి సినిమాలో బృంద తన గొంతు వినిపించనుంది. తిరు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రెజీనా హీరోయిన్ గా నటిస్తోంది. సూర్య అండ్ కార్తికి ఫ్యాన్ బేస్ ఎక్కువే కాబట్టి బృందకు వాళ్లంతా వెల్ కం చెప్పేస్తున్నారు.

కోలీవుడ్ కుటుంబం మొత్తం సినిమాల్లో ఉన్నవారిలో శివకుమార్ ఫ్యామిలీ రెండోది. మొదట ఆ క్రెడిట్ దక్కింది సూపర్ స్టార్ రజనీకాంత్ కే. తమిళ్ టాప్ హీరోల్లో ఒకడైన ధనుష్ ఆయన అల్లుడు. పెద్ద కూతురు ఐశ్వర్యను ధనుష్ పెళ్లి చేసుకున్నాడు. ఐశ్వర్య తన భర్త హీరోగా త్రీ సినిమా డైరెక్ట్ చేసింది. రెండో కుమార్తె సౌందర్య ఇంతకుముందు కొచ్చాడయాన్ (తెలుగులో విక్రమసింహ) అనే యానిమేషన్ సినిమా డైరెక్ట్ చేసింది.
Tags:    

Similar News