ఒకవేళ.. సూర్య 24 హిట్టయ్యిందనుకోండి.. అప్పుడు నందమూరి నటసింహం అనుకున్న కాన్సెప్టుకు కాస్త బ్రేక్ పడినట్టేనా అంటే అవుననే అంటున్నారు ఫిలిం నగర్ జనాలు. ఎందుకంటే ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలు అనేవి ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉంటేనా కిక్కిస్తాయి. ఆల్రెడీ చూసినట్లు ఉంటే మాత్రం ప్రేక్షకులు పెద్దగా ఆదరించరు.
మ్యాటర్ లోకి వచ్చేస్తే.. బాలయ్య హీరోగా 90వ దశకంలో ఆదిత్య 369 సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ప్రఖ్యాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందించారు. అయితే ఈ సినిమా సీక్వెల్ చేయడానికి అటు సింగీతం.. ఇటు బాలయ్య.. కూడా రెడీగా ఉన్నారని ఎప్పటినుండో వార్తలొస్తున్నాయి. కాని వీళ్లకంటే ముందే ఇప్పుడు కొత్త తరానికి టైమ్ ట్రావెల్ ను చూపించడానికి '24' సినిమాతో సూర్య వచ్చేస్తున్నాడు. మహేష్ బాబు రిజక్టు చేసిన ఈ విక్రమ్ కుమార్ సినిమాను ఇప్పుడు సూర్య ఎంతో సీరియస్ గా తీసుకొని ముందుకొస్తున్నాడు. ఒకవేళ ఈ సినిమా పెద్ద హిట్టయితే మాత్రం.. సింగీతం చేద్దామని అనుకుంటున్న సినిమాకు కాస్త మార్పులూ చేర్పులూ చేయాల్సిందే మరి.