విలన్ రోల్స్ బాగానే అచ్చొచ్చాయ్

Update: 2017-06-18 09:27 GMT
ఫిలింఫేర్ అవార్డును అందుకోవడం ఎవరికైనా ప్రతిష్టాత్మకమే. కానీ నెగిటివ్ రోల్స్ లో మెప్పించి ఈ అవార్డును అందుకోవడం అంత సులభమేమీ కాదు. పైగా స్టార్స్ గా వెలుగుతున్న వారు నెగిటివ్ రోల్స్ చేయడం.. వాటికి ఫిలింఫేర్స్ దక్కడం అరుదైన సంగతిగానే చెప్పాలి.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన 24 చిత్రంలో విలన్ గా ఓ పాత్ర చేశాడు. ఈ మూవీలో పోషించిన ఆత్రేయ పాత్రకు క్రిటిక్స్ అవార్డ్ రూపంలో బెస్ట్ యాక్టర్ అందుకున్నాడు సూర్య. ఒక స్టార్ హీరో ఇలా నెగిటివ్ రోల్ కి అవార్డ్ అందుకోవడం స్పెషల్ అనాల్సిందే. 'నేను ఫిలింఫేర్ అవార్డ్ అందుకుని 9 సంవత్సరాలైంది. రేపు ఫాదర్స్ డే అనగా ఇవాళ ఈ అవార్డ్ నా కొడుకుతో కలిసి అందుకోవడం నాకు చాలా ప్రత్యేకమైనది' అని చెప్పాడు సూర్య. ఈ మాటలు అందరినీ కట్టిపాడేశాయ్.

సౌత్ బ్యూటీ త్రిషకు ఈ ఏడాది ఫిలింఫేర్ దక్కింది. ఈమెకు కూడా క్రిటిక్స్ అవార్డ్ విభాగంలో బెస్ట్ యాక్ట్రెస్ పురస్కారం దక్కగా.. కోడి చిత్రంలో ఈమె పోషించిన నెగిటివ్ రోల్ కే ఈ అవార్డ్ రావడం విశేషం. సాఫ్ట్ గా కనిపిస్తూనే.. కన్నింగ్ రోల్ చేసిన త్రిష అవార్డ్ అందుకుంటూ.. అసలు ఈ నెగిటివ్ రోల్ ను తాను మెప్పించగలనా అని అనుమానించినట్లు చెప్పింది. 'కానీ దర్శకుడు మాత్రం ఈ పాత్రను నన్ను దృష్టిలో ఉంచుకునే రాసినట్లు చెప్పి.. నన్ను ఒప్పించాడు. ఇప్పుడు ఫిలింఫేర్ అందుకునేందుకు కారణం అయ్యాడు' అని చెప్పింది త్రిష.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News