తమిళ స్టార్ హీరో సూర్య - అసిన్ నాయకానాయికలుగా నటించిన గజిని కల్ట్ జానర్ లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే.ఈ సినిమా సూర్యకి తెలుగులో మంచి మార్కెట్ ని తెచ్చిపెట్టింది. తాజా సమాచారం మేరకు... ఈ చిత్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ సూర్య ప్రధాన పాత్రలో గజినికి సీక్వెల్ తీయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. దర్శకుడు ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడని సమాచారం. సూర్యతో మురుగదాస్ మూడవసారి కలిసి పని చేసే అవకాశం కోసం వేచి చూస్తున్నాడు. ఏఆర్ మురుగదాస్ ఇటీవల రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన దర్బార్ కి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
గజిని సీక్వెల్ గురించి చాలా కాలంగా పుకార్లు షికార్ చేస్తున్నాయి. నిజానికి అల్లు అర్జున్ `పుష్ప` చిత్రీకరణను పూర్తి చేసిన తర్వాత ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నారని గత ఏడాది మార్చిలో కథనాలొచ్చాయి. ఓవైపు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్.. కొరటాల శివతోనూ అతడు సినిమాలకు ప్లాన్ చేస్తుండగా మురుగదాస్ తోను మంతనాలు సాగించాడని గుసగుసలు వినిపించాయి.
జాతీయ ఉత్తమ దర్శకుడిగా సంచలనాలు సృష్టించిన మురుగదాస్ తో సినిమా అంటే పెద్ద స్థాయిలో అంచనాలుంటాయి. పైగా ఇది పాన్ ఇండియా అప్పీల్ తో ఉంటుంది. అందుకే దీనిపై అభిమానుల్లో ఆసక్తి కలిగింది. ఈ జోడీ ఎలాంటి కాన్సెప్ట్ తో పని చేస్తారు? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అంతకుముందే అల్లు అరవింద్ `గజిని 2` టైటిల్ ని ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ చేయించారని బన్ని-మురుగదాస్ కాంబినేషన్ లో ఇది తెరకెక్కుతుందని ప్రచారమైంది. ఇక మురుగదాస్ కూడా బన్నీ కోసం స్క్రిప్టును వందశాతం సిద్ధం చేస్తున్నారని గుసగుసలు వినిపించాయి. రజనీకాంత్ దర్బార్ తర్వాత మురుగదాస్ కి ఎందుకింత గ్యాప్ అంటే...బన్నీతో గజిని సీక్వెల్ కోసమేనని భావించారు.
గజినీ చిత్రంలో సూర్య నటించగా సంచలనాలు సృష్టించింది. హిందీలో అమీర్ ఖాన్ కథానాయకుడిగా మురుగదాస్ గజినీ చిత్రాన్ని రీమేక్ చేయగా అక్కడ ఇండస్ట్రీ హిట్ అయింది. ఇప్పుడు బన్నీతో సీక్వెల్ మరో లెవల్లో ఉంటుందని అభిమానులు ఆశించారు. కానీ ఇప్పుడు సీక్వెల్ కోసం సూర్య పేరు వినిపిస్తోంది. గజినీ సీక్వెల్ కోసం సూర్య సిద్ధమవుతున్నాని కథనాలొస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రీకరణ లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.