జక్కన్న బాటలో సూర్య.. సక్సెస్ అయ్యేనా!

Update: 2023-01-20 05:30 GMT
సూర్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తమిళ హీరో అయినప్పటికీ... తెలుగువారికి తన సినిమాలతో ఎంతో దగ్గరయ్యాడు. చివరిగా జై భీమ్ అనే సినిమాతో హిట్ అందుకున్న సూర్య... ఆ తర్వాత ఈటీ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు.

కానీ ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రతో ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత రాకెట్రీ సినిమాలో కూడా గెస్ట్‌ రోల్‌లో కనిపించాడు. ప్రస్తుతానికి సూర్య కెరియర్‌లో 42వ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి దర్శకుడిగా అజిత్‌తో అనేక సినిమాలు చేసి హిట్లు కొట్టిన శివ వ్యవహరిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం తెర మీదకు వచ్చింది. అదేంటంటే ముందుగా ఈ సినిమాని 3డీ యానిమేషన్‌లో తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఓన్లీ 3D ఫార్మాట్‌లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని సమాచారం. అలాగే ముందు అనుకున్నట్లు కాకుండా.. ఈ సినిమాను రెండు పార్ట్‌లుగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలను కూడా పండుగల సందర్భంగా విడుదల చేసి మార్కెట్‌లో నాలుగు రాళ్లు వెనకేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరితో పాటు యోగి బాబు, కోవై సరళ వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య ఒక యుద్ధ వీరుడు పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఒక అంతుచిక్కని వ్యాధితో ఆయన 16వ శతాబ్దంలో చనిపోతే... ప్రస్తుత కాలంలో ఉన్న ఒక యువతి.. ఆయన ఏ కారణంతో చనిపోయాడు అంటూ రీసెర్చ్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

స్టూడియో గ్రీన్ యూవీ క్రియేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఒక రకమైన ప్రచారం జరుగుతూ.. రాగా ఇప్పుడు సరికొత్త ప్రచారాలు బయటకువచ్చాయి.  ఇందులో ఏది నిజం అనే విషయం మీద ఎవరూ తేల్చుకోలేకపోతున్నారు. మొత్తం మీద రెండు భాగాలు అనే కాన్సెప్ట్ తెలుగు  ప్రేక్షకులకు కొంతమేర బాగానే వర్కౌట్ అయ్యాయి. రాజమౌళి తెరకెక్కించిన బహుబలి, బహుబలి 2 బాగా హిట్‌ అయ్యాయి. తమిళ పొన్నియాన్ సెల్వన్ కూడా కొంతమేర వర్కౌట్ అయింది. ఈనేపథ్యంలోనే సూర్య సినిమాని కూడా రెండు భాగాలుగా విడుదల చేయాలనుకోవడం ఆసక్తి కరం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News