కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ కోర్టు డ్రామా ''జై భీమ్''. టీజే జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సూర్య - జ్యోతిక కలిసి నిర్మించారు. వాస్తవ సంఘటన ఆధారంగా సామాజిక రాజకీయ అంశాలతో ముడిపెడుతూ రూపొందిన ఈ సినిమాలో సూర్య ఒక లాయర్ గా కనిపించారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ - మణికందన్ - లిజో మోల్ జోస్ - రజిషా విజయన్ కీలక పాత్రలు పోషించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో నవంబర్ 2న ఈ సినిమా విడుదల అయింది.
తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదలైన ''జై భీమ్'' చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. డబ్బులు తీసుకోకుండా అణచివేతకు గురైన అమాయక ప్రజల తరపున వాధించిన జస్టిస్ కె చంద్రు జీవితంలోని సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అమాయకులైన గిరిజనులపై కొందరు పోలీసులు అక్రమ కేసులు బనాయించి.. చేయని నేరానికి వారిని ఎలా బలి చేస్తారు.. నేరం ఒప్పించేందుకు ఎలాంటి చర్యలకు దిగుతారన్న విషయాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశారు.
'బై భీమ్' చిత్రంలో లీడ్ రోల్ ప్లే చేసిన సూర్య తో పాటుగా ప్రకాష్ రాజ్ - మణికందన్ - లిజో మోల్ జోస్ - రజిషా విజయన్ ల నటనను అందరూ కొనియాడుతున్నారు. అయితే ఓ వైపు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తుంటే.. మరోవైపు ఓ వివాదం చెలరేగింది. సినిమాలో ఐజీ పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్.. కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఓ సన్నివేశంలో ఒకతన్ని చెంపదెబ్బ కొడతాడు. దక్షిణాది వెర్సన్స్ ప్రకారం ఆ సమయంలో ఆ వ్యక్తి హిందీలో మాట్లాడగా.. ప్రకాష్ రాజ్ అతన్ని కొట్టి స్థానిక భాషలో మాట్లాడమంటాడు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది.
'జై భీమ్' సినిమాలో హిందీ భాషను కించపరిచారంటూ సోషల్ మీడియా వేదికగా నార్త్ ఆడియన్స్ మండిపడుతున్నారు. హిందీ సినిమాలతో పాపులారిటీ తెచ్చుకున్న ప్రకాష్ రాజ్.. అలాంటి సీన్ లో ఎలా నటించారని ప్రశ్నిస్తున్నారు. అయితే హిందీలో మాత్రం ఈ సన్నివేశాన్ని ‘నిజం చెప్పు’ అనేలా డబ్ చేశారు. ఈ కాంట్రవర్సీపై తమిళులు కూడా కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. 'స్కామ్ 1992' సిరీస్ లో ఓ సీన్ లో ఒకతను తమిళ్ లో మాట్లాడగా.. హిందీలో మాట్లాడమని కొట్టే సీన్ ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. చిత్ర బృందం మాత్రం ఇది హిందీని తక్కువ చేయడానికి పెట్టిన సీన్ కాదని.. అలాంటి ఉద్దేశం తమకు లేదని.. కేవలం కథాపరంగానే ఆ సన్నివేశం వస్తుందని చెబుతున్నారు. ఇకపోతే తమిళ బాషాభిమానులు గతంలో కేంద్ర ప్రభుత్వం హిందీ లాంగ్వేజ్ ను కంపల్సరీ చేయడాన్ని వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.