నిన్న ఏకంగా మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడంతో సినిమా ప్రేమికులు చాలా ఆశించారు. అందులో రెండు డబ్బింగ్ అయినప్పటికీ ఆర్టిస్టుల పరంగా మంచి ఇమేజ్ ఉన్న వాళ్ళు కావడంతో అంచనాలు అన్నింటి మీదా ఉన్నాయి. సూర్య సాయి పల్లవి రకుల్ ప్రీత్ సింగ్ ల కాంబినేషన్ లో వచ్చిన ఎన్జికె మీద విపరీతమైన నెగటివ్ కామెంట్స్ వచ్చి పడుతున్నాయి. కథ చూసుకోకుండా సూర్య ఉన్నాడు కదాని శ్రీ రాఘవ చిత్తానికి సినిమాను తీసుకుంటూ పోయిన తీరుకి రివ్యూలు సైతం సింగల్ రేటింగ్ ఇవ్వడమే ఎక్కువ అనేలా ఫీడ్ బ్యాక్ ఇచ్చాయి.
టాలీవుడ్ సూర్య కెరీర్లో ఇది అతి పెద్ద డిజాస్టర్ గా నిలవబోతోందని రిపోర్ట్స్ తో పాటు అంతంత మాత్రంగా వచ్చిన ఓపెనింగ్స్ చెబుతున్నాయి. ఇక ప్రభుదేవా తమన్నాల అభినేత్రి 2 గురించి ఎక్కువ మాట్లాడుకోకపోవడం మంచిది. అసలెందుకు తీశారో అర్థం కాని విచిత్రమైన హారర్ కథతో ప్రేక్షకుల సహనానికి పరీక్షలు పెడుతోంది
ఇక స్ట్రెయిట్ మూవీగా సురేష్ సంస్థ అండదండలతో వచ్చిన ఫలక్ నుమా దాస్ కు సైతం రెస్పాన్స్ ఏమంత పాజిటివ్ గా లేదు. కేవలం ట్విన్ సిటీస్ యూత్ కి నేటివిటీ పరంగా కొంత వరకు కనెక్ట్ అవుతూ అక్కడ ఓ మాదిరి వసూళ్లు తెచ్చుకున్నా విశ్వక్ సేన్ ప్రయత్నం మిగిలిన ఏరియాల నుంచి నెగటివ్ రిపోర్ట్స్ రాకుండా ఆపలేకపోయింది. సెకండ్ హాఫ్ మీద వస్తున్న విపరీతమైన క్రిటిసిజం మౌత్ టాక్ రూపంలోనూ రిపీట్ అవుతోంది.
అంగమాలే డైరీస్ లోని అత్మను ఓడిసిపట్టుకోవదంలో విఫలమైన విశ్వక్ సేన్ ఎంతసేపు బోల్డ్ కంటెంట్ మీదే ఆధారపడటంతో ఫలితం ప్రతికూలంగా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి మూడు ముక్కలు లెక్క తప్పి మరో ఫ్రైడేని డ్రై డేగా మార్చి మూవీ లవర్స్ ని నిరాశ పరిచాయి. మళ్ళి ఇంకో వారం రోజులు ఎదురుచూడటం తప్ప ఏమి చేయలేని పరిస్థితి