సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ''పవర్ స్టార్'' సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ గా రూపొందిన ఈ సినిమా పవర్ ఫుల్ హిట్ అయిందని.. రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ వచ్చాయని.. ఇండస్ట్రీ ఛేంజర్ అని వర్మ చెప్తున్నాడు. 'పవర్ స్టార్' సినిమా ఎలా ఉందనేది పక్కన పడితే దీనిపై ఓ వర్గం ఆడియన్స్ మాత్రం కోపంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా వర్మపై ఫైర్ అవడమే కాకుండా ఆయన ఆఫీస్ పై దాడి కూడా చేసారు. ఈ క్రమంలో ఇన్ని రోజులు సైలెంటుగా ఉన్న ఇండస్ట్రీలోని ప్రముఖులు ఈ రోజు సినిమా విడుదలైన తర్వాత స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత సితార ఎంటెర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
నాగవంశీ ట్వీట్ చేస్తూ ''ఈ రోజుల్లో సెన్సేషనలిజం అనేది సొసైటీ యొక్క ప్రమాణంగా మారింది. ప్రతి మలుపులో రాబందులు మంత్రగత్తెలు ఉన్నారు.. వారు ప్రతి ఒక్కరినీ వారి మనుగడ కోసం టార్గెట్ చేస్తుంటారు. ఈ స్కావెంజర్లకు సిగ్గు ఉండదు. వారితో పోరాడటానికి బెస్ట్ సొల్యూషన్ 'ద్వేషం' కాదు.. వారిని ఇగ్నోర్ చేయడం!'' అని పేర్కొన్నారు. దీనికి త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలోని ''కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేటా?'' అని ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ ని జత చేసారు. ఈ ట్వీట్ లో ఎక్కడ కూడా రామ్ గోపాల్ వర్మ గురించి మెన్షన్ చేయనప్పటికీ పరిస్థితులను బట్టి చూస్తే అతన్ని ఉద్దేశించే ఈ ట్వీట్ పెట్టాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ''ఆర్జీవీ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమాలు తీసినప్పుడు ఈ సెన్సేషనలిజం గుర్తుకు రాలేదా.. మీ ఫ్రెండ్ త్రివిక్రమ్ ని పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చినప్పుడే సెన్సేషనలిజం గుర్తుకు వచ్చిందా'' అని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకముందు హీరో నిఖిల్ కూడా వర్మని కుక్కతో పోల్చుతూ ఇండైరెక్ట్ గా ట్వీట్ పెట్టిన సంగతి తెలిసిందే.
Full View Full View