అక్కినేని హీరో రియల్ కష్టాలివీ..

Update: 2018-07-29 14:30 GMT
ఎంత పెద్ద ఫ్యామిలి నుంచి వస్తే  ఏం లాభం ఒక్క విజయం  కోసం చకోర పక్షిలా విహరిస్తూనే ఉన్నాడు అక్కినేని సుశాంత్.. ఇండస్ట్రీలోకి వచ్చి 10 ఏళ్లు అవుతున్నా ఇప్పటివరకూ సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. ‘కాళిదాసు’ మూవీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సుశాంత్.. మొన్నటి ‘ఆటాడుకుందాం రా’  వరకూ ఎన్నో సినిమాలు చేసినా  ఏ ఒక్కటి కలిసిరాలేదు. కెరీర్ లో హిట్టు కోసం ఎంతో కష్టపడుతున్న సమయంలో తన తండ్రి చనిపోవడం వేదన మిగిల్చిందని సుశాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన కెరీర్ గురించి తండ్రి ఎంతో కంగారు పడేవాడని.. అయితే నాన్న చనిపోయేముందు  ఆయనకు ‘చి.ల.సౌ’ కథ వినిపించానని.. ఈ సినిమాతో ఖచ్చితంగా నిలదొక్కుకుంటానని చెప్పారని సుశాంత్ తెలిపాడు.

సినిమా ఫ్లాప్ అయినప్పుడు అందరిలాగే తాను బాధపడతానని.. ఆ సమయంలో చాలా మంది అనేక రకాలు విమర్శిస్తారని సుశాంత్ ఆవేదన వ్యక్తం చేశఆడు. ఆ విమర్శలను బట్టి తాను లోపాలు సరిదిద్ధుకుంటానని తెలిపాడు. ఫ్లాపుల తాలూకు బాధను మరిచిపోవడానికి స్నేహితుల్ని  కలుస్తానని.. కుంటుంబంతో సరదాగా గడుపుతానని వివరించారు. తరుచుగా అఖిల్ - చైతన్యలను కలిసి బాధను పంచుకుంటానని తెలిపాడు.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చే ‘చి.ల.సౌ’ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందని సుశాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాతో మానాన్నకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని సుశాంత్ తెలిపాడు.
Tags:    

Similar News