పోయినవాడు తిరిగి రాడు! అలాగని నిజాల్ని నిగ్గు తేల్చకుండా నిలువరించలేం. ఇది హత్యనా? ఆత్మహత్యనా? తేలాల్సిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అభిమానులు సహా అతడి కోస్టార్లు చేస్తున్న డిమాండ్ ఇది. అందుకే సీబీఐ సహా కేంద్రం ఈ కేసు విషయమై చాలా సీరియస్ గా ఉన్నాయి. సుశాంత్ మరణం వెనక మాఫియా కుట్రలేవైనా ఉంటే వాటి నిగ్గు తేల్చాలన్న పంతం అంతకంతకు పెరుగుతోంది.
అయితే సుశాంత్ సింగ్ భవిష్యత్ కలల గురించి తెలుసుకుంటే మాత్రం ఎన్నో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ఈడీ సీబీఐ దర్యాప్తుల్లో కఠోర నిజాలు వెలుగు చూస్తుంటే సుశాంత్ వ్యక్తిగత డైరీలో ప్రణాళికలు చూస్తుంటే ఇంకా ఇంకా షాక్ కి గురి చేసేవిగా ఉన్నాయి.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వ్యక్తిగత డైరీ నుండి కొన్ని పేజీలను సీబీఐ యాక్సెస్ చేసింది. దీనిలో అతను 2020 కోసం తన అద్భుత ప్రణాళికలను రివీల్ చేశారు. సుశాంత్ ఈ ఏడాది హాలీవుడ్ లోకి అడుగుపెట్టాలని కలగన్నాడు. దానిని డైరీలో రాసుకున్నాడు. సొంతంగా ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించి సినిమా- విద్య- పర్యావరణ రంగానికి తనవంతుగా సాయపడాలని అందులో రాసుకున్నాడు.
సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి ట్విట్టర్ లోకి ప్రకటించినట్టే భవిష్యత్ పై అతడి ఆశావహ ధృక్పథం అంతా ఆ డైరీలో కనిపిస్తోంది. తన కలలను ఎలా నిజం చేసుకోవాలో తెలిసిన వ్యక్తి ... శాశ్వతమైన పాజిటివిస్ట్ అయిన హీరో నా సోదరుడు అంటూ సుశాంత్ సోదరి ఇంతకుముందు ఓ వీడియోలో ఎమోషన్ కి గురైన సంగతి తెలిసినదే. ఆమె స్వయంగా సుశాంత్ వ్యక్తిగత డైరీ నుండి పేజీలను షేర్ చేసింది.
ఇలా ఉండగానే పార్టీ పత్రిక `సామ్నా`లో శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తన కుటుంబంతో సత్సంబంధాలు కలిగి లేడని రాయడంతో దానిని ఖండిస్తూ.. దివంగత నటుడితో తమ అనుబంధంపై సుశాంత్ కుటుంబం తొమ్మిది పేజీల సుదీర్ఘ లేఖ రాసింది. ``సుశాంత్ హత్యకు గురయ్యాడని... న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తున్నప్పుడు సోదరి .. తండ్రి బెదిరింపులను ఎదుర్కొన్నామ``ని ఆ లేఖలో షాకింగ్ నిజాల్ని వెల్లడించారు.
ఇదిలావుండగా సుశాంత్ బలవన్మరరణ కేసుపై ఏకీకృత సిబిఐ దర్యాప్తు కోరుతూ పిల్ ను గురువారం (ఆగస్టు 13) సుప్రీంకోర్టు విచారించనుంది. బిజెపి నాయకుడు.. న్యాయవాది అజయ్ అగర్వాల్ దాఖలు చేసిన పిల్ ను చీఫ్ జస్టిస్ ఎస్ ఎ బోబ్డే- ఎ.ఎస్ బోపన్న- వి రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం విచారించనుంది.