రియా 4 రోజుల విచారణ పూర్తి.. మరో మూడు రోజులు

Update: 2020-09-01 04:00 GMT
సుశాంత్‌ మృతి కేసులో ప్రధాన నింధితురాలు అంటూ ప్రచారం జరుగుతున్న రియా చక్రవర్తిని సీబీఐ వారు శుక్రవారం నుండి మొదలుకుని ఎంక్వౌరీ చేస్తున్నారు. మద్యలో ఆదివారం వచ్చినా కూడా ఆమె విచారణ మాత్రం కొనసాగింది. సీబీఐ వారు వందల కొద్ది ప్రశ్నలను ఆమెపై విసురుతున్నారు. ఇప్పటికే నాలుగు రోజుల విచారణ పూర్తి అయ్యింది. మరో మూడు రోజుల పాటు విచారించేందుకు ఆమెకు సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారట. ఈ విషయంలో ఆమె సహకారం కోరుతున్నట్లుగా అధికారులు లేఖలో పేర్కొన్నారు.

వరుసగా ఏడు రోజుల పాటు రియాను ప్రశ్నిస్తున్న సీబీఐ వారు కేసు విషయంలో అతి త్వరలోనే తుది ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేస్తారనే నమ్మకంతో సుశాంత్‌ అభిమానులు ఉన్నారు. రియా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సుశాంత్‌ మృతికి కారణం అంటూ బలంగా వాదిస్తున్న ఆయన కుటుంబ సభ్యులను మరియు సుశాంత్‌ సన్నిహితులు మరియు పని వారిని కూడా సీబీఐ ఇదే సమయంలో విచారణ చేస్తుంది.

ముఖ్యంగా రియా వల్లే సుశాంత్‌ మృతి చెందాడు అంటూ అతడి సోదరి మీతూ సింగ్‌ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆమె వాదన వినేందుకు సీబీఐ సిద్దం అయ్యింది. మొత్తానికి సీబీఐ వారి ఎంట్రీతో ఈ కేసులో ఖచ్చితంగా సుశాంత్‌ కుటుంబ సభ్యులకు మరియు అభిమానులకు న్యాయం జరుగుతుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News