'నన్ను కూడా చంపేస్తారు అంటూ సుశాంత్‌ భయపడేవాడు'

Update: 2020-09-17 10:10 GMT
బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్ అనుమానస్పద మృతి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సుశాంత్‌ మాజీ మేనేజర్‌ దిశా ఆత్మహత్యకు పాల్పడిన కొన్ని రోజులకే సుశాంత్‌ మృతి చెందడం అనేక అనుమానాలను రేకెత్తించింది. డిప్రెషన్ కారణంగానే సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడని.. హత్య చేసారని అనేక వాదనలు తెరపై వచ్చాయి. అయితే ఈ కేసుని సీబీఐ విచారించే క్రమంలో డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరోవైపు సీబీఐ కూడా ఈ కేసుని విచారిస్తూ సుశాంత్‌ జీవితానికి సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలో తాజాగా సుశాంత్‌ స్నేహితుడు సిద్దార్థ్‌ పితానీని సీబీఐ విచారించగా.. సుశాంత్‌ చనిపోవడానికి కొన్నిరోజుల ముందు ఏం జరిగిందో సిద్దార్థ్‌ వెల్లడించినట్లు తెలుస్తోంది.

కాగా, 'సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సూసైడ్ తర్వాత అతను ఎంతో భయాందోళనలకు గురయ్యాడని.. తరచూ 'నన్ను చంపేస్తారు' అంటూ సుశాంత్‌ కంగారు పడుతూ చెప్పేవాడని.. సుశాంత్ తన సెక్యూరిటీని కూడా పెంచుకోవాలనుకున్నాడని' సీబీఐ విచారణలో సిద్దార్థ్‌ పితానీ చెప్పినట్లు జాతీయ మీడియా లో వార్తలు వస్తున్నాయి. సుశాంత్‌ సింగ్ ల్యాప్‌ టాప్‌ మరియు హార్డ్‌ డిస్క్ లను రియా చక్రవర్తి తీసుకువెళ్లిందని సిద్దార్థ్‌ వెల్లడించినట్లు తెలుస్తోంది. మరో వైపు డ్రగ్స్‌ కోణం లో విచారణ చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సుశాంత్ తో సంబంధాలు ఉన్న ప్రతి ఒక్కర్నీ విచారిస్తోంది. ఈ క్రమంలో సుశాంత్ మాజీ మేనేజర్‌ అంకిత్‌ ఆచార్య ను విచారణ చేయగా.. సుశాంత్‌ ఎప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదని అతను చెప్పినట్లు సమాచారం. 'సుశాంత్‌ మరణించిన నాటి నుంచి నేను ఇది ఆత్మహత్య కాదు హత్య అని చెప్తున్నానని.. సుశాంత్‌ ఎప్పుడూ డ్రగ్స్‌ తీసుకో లేదని.. డ్రగ్స్ కి బానిసలైతే డ్రీమ్స్ నెరవేర్చుకో లేరని సుశాంత్‌ కి బాగా తెలుసని' అంకిత్‌ చెప్పినట్లు గా నేషనల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి.
Tags:    

Similar News