సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కేసులో ఎయిమ్స్ బృందం ఫోరెన్సిక్ నివేదికను సిబిఐకి సమర్పించింది. నిజం ఏదో తేలబోతోందా? ఇది హత్యా ఆత్మహత్యా? త్వరలోనే కేసు ముగియబోతోందా?..అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ఎయిమ్స్ బృందం చివరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు తమ నివేదికను ఇచ్చింది. దివంగత నటుడి కుటుంబం సాధారణ ప్రజల నుండి ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సిబిఐకి ఇది కాస్త ఊరట అనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మరణంపై దర్యాప్తు విషయంలో జాప్యం జరుగుతోందంటూ ఇటీవల చాలా విమర్శలను ఎదుర్కొన్నారు సీబీఐ అధికారులు. న్యాయం కోసం సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైన భావజాలం బయటపడింది.
మరోవైపు సీబీఐ ఈ కేసులో కీలక ప్రముఖుల్ని అరెస్ట్ చేయడంలో బిజీ అయ్యింది. ఎట్టకేలకు ముంబైలో దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత సిబిఐ బృందం తిరిగి దిల్లీకి చేరుకుంది. ఎయిమ్స్ వైద్యులు సీబీఐ అధికారులను కలిసి వారికి రిపోర్టులు అందించారు. ఇరు వర్గాల నడుమ దాదాపు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. సుశాంత్ మరణానంతరం తన ఇంటికి దగ్గరలో ఉన్న కూపర్ ఆసుపత్రిలో సుశాంత్ పంచనామా నిర్వహించారు. అయితే ముంబై పోలీసులు ఈ కేసులో ప్రతిదీ తారుమారు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతరం రకరకాల పరిణామాలతో సీబీఐ బరిలో దిగి కేసును రీ కన్‌స్ట్రక్షన్ చేసింది.
సీబీఐ పోస్ట్‌మార్టం రిపోర్టు విషయంలో సహకరించాలని ఎయిమ్స్‌ను కోరింది. దీంతో రంగంలోకి దిగిన ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం సుశాంత్ ఇంటిని కూడా పరిశీలించింది. సుశాంత్ మరణం వెనుక ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా? హత్యా? ఆత్మహత్యా? అన్నదానిపై పరిశోధించింది. ఇక సుశాంత్ సింగ్ కేసు పూర్తిగా డ్రగ్స్ తో ముడిపడిన అంశంగా మారడంతో ఈ కేసును మరింత లోతుగా సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి విధితమే.