సుశాంత్ కేసులో మరో ట్విస్ట్.. సెక్షన్ 302 విధించడానికి సిద్ధమైన సీబీఐ...?
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అకాల మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. జూన్ 14న సుశాంత్ తన నివాసంలో విగతజీవిగా కనిపించాడు. అయితే యువ హీరో మరణించి ఇన్ని రోజులైనా ఈ కేసు మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అయితే సుశాంత్ సింగ్ మృతి కేసులో రోజులు గడిచేకొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసి విచారిస్తోంది. అయితే ఇటీవల ఎయిమ్స్ వైద్య బృందం అందించిన రిపోర్ట్ ప్రకారం సుశాంత్ ది ఆత్మహత్యే అని తేలింది. సుశాంత్ బాడీలో ఎలాంటి విషం లేదని.. అది ఆత్మహత్యే అని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు ఈ కేసులో మరో సంచలన విషయం వెల్లడైంది.
సుశాంత్ చనిపోయే ముందురోజు అతని ఇంట్లో పార్టీ జరిగిందనే విషయంపై పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇది నిజమే అని అనుమానం కలిగించేలా కొత్త ట్విస్టు తెరపైకి వచ్చింది. జూన్ 13 - 14 మధ్య రాత్రి సుశాంత్ అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని డ్రాప్ చేశారనే విషయాన్ని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. జూన్ 13వ తేదీ అర్ధరాత్రి సుశాంత్ - రియా చక్రవర్తి ఇద్దరూ కలిసి ఉండటాన్ని చూశానని.. రాత్రి 2 నుంచి 3 గంటల ప్రాంతంలో రియాని తన ఇంటిలో సుశాంత్ డ్రాప్ చేయడాన్ని స్వయంగా చూశానని చెప్పినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. అయితే సుశాంత్ ఫ్లాట్ లో ఉండే రియా చక్రవర్తి.. జూన్ 8న సుశాంత్ సిస్టర్ ఇంటికి వస్తుండటంతో తనని వెళ్లిపోమన్నాడని.. సుశాంత్ ఆదేశాల మేరకు ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయాను.. ఆ తర్వాత సుశాంత్ ని కలవలేదు అనే విషయాన్ని రియా చక్రవర్తి వెల్లడిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు సుశాంత్ చనిపోవడానికి కొన్ని గంటల ముందు రియాతో ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా సుశాంత్ కేసులో ఎయిమ్స్ వైద్యుల రిపోర్టులు స్వీకరించిన సీబీఐ అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేయనున్నారని తెలుస్తోంది. వారు ఆత్మహత్య అని చెప్పినప్పటికీ తాము ఇది ఆత్మహత్యా? హత్యా? అన్నది తేల్చలేకపోతున్నామని.. అందుకే సీబీఐ ఈ కేసులో ఐపీసీ 302 సెక్షన్ ను విధించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. సుశాంత్ మీద విషప్రయోగం చేయకున్నా వేరేలా హతమార్చి ఉండొచ్చు కదా అనే కోణంలో అధికారులు ఆలోచిన్నారట. ప్రస్తుత ఎఫ్ఐఆర్ కు అదనంగా ఈ సెక్షన్ ను చేరుస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ కేసు మరో మలుపు తిరగనుంది.