సుశాంత్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. మరో అరెస్ట్

Update: 2021-02-03 09:30 GMT
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హత్య కేసు మిస్టరీ ఇప్పటికీ వీడడం లేదు. తాజాగా సుశాంత్ మరణానికి సంబంధించి మాజీ అసిస్టెంట్ డైరెక్టర్, సుశాంత్ స్నేహితుడు రిషికేశ్ పవార్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) మంగళవారం అరెస్టు చేసింది.  30 రోజుల నుండి పవార్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్‌సిబి దర్యాప్తు చేసిన డ్రగ్స్ కేసులో రిషికేశ్ పవార్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ముంబై సెషన్స్ కోర్టు గత నెలలో తిరస్కరించింది.

అప్పటి నుండి ఎన్‌సిబి అధికారులు రిషికేశ్ పవార్ కోసం గాలిస్తున్నారు.  2020 సెప్టెంబర్‌లో ఎన్‌సిబి పవార్ కు సుశాంత్ తో సంబంధం ఉందని ప్రశ్నించింది. దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించడానికి ఒక నెల ముందు అతడికి డ్రగ్స్ సరఫరా చేయడంలో పవార్ ప్రధాన పాత్ర పోషించాడని పోలీసులు గుర్తించారు.

పవార్ అక్రమంగా డ్రగ్స్ సేకరించడం..   వాటిని సరఫరా చేయడం కోసం సుశాంత్ సిబ్బంది సావంత్ కూడా సహకరించాడని తేలింది.. సుశాంత్ కోసం పనిచేస్తున్న సమయంలో ఆయనకు  డ్రగ్స్ పంపిణీ చేసింది పవార్ అని సావంత్ పోలీసులకు తెలిపాడు. దీంతో ఎన్‌సిబి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పవార్ వెంటనే ముంబై సెషన్స్ కోర్టు, బొంబాయి హైకోర్టులను ఆశ్రయించారు. కానీ ఈ పిటీషన్ ను తిరస్కరించారు.

 ఎన్‌సిబి అధికారులు తాజాగా పవర్ కు చెందిన చెంబూర్ నివాసాన్ని సందర్శించారు. ఎన్‌సిబి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే మాట్లాడుతూ “రిషికేశ్ పవార్ ఈ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో కీలకంగా ఉన్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ అయిన ఇతడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు డ్రగ్స్ సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషించాడు’ అని తెలిపారు.  రిషికేశ్‌ను పట్టుకొని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ రోజు కోర్టులో హాజరుపరచనున్నారు.
Tags:    

Similar News