ఖాన్ ల త్రయానికి ఘోర అవమానమిది. బిలియన్ డాలర్ సెన్సేషన్స్ గా చెప్పుకునే ఖాన్ లు ఇంతవరకూ కేరళ వరదలకు చేసిన సాయమేంటి? అంటే గుండు సున్నా. ఒకే దేశం ఒకే జాతి అంటూ దేశ సమగ్రతపై వేదికల సాక్షిగా లెక్చర్లు దంచే వీళ్లు కేవలం అభిమానుల్ని సాయం చేయమని కోరడం తప్ప చేసిందేం లేదు. పైకి కనిపించేంత ఢాంబికం లోన కనిపించలేదంతే!
అయితే ఖాన్ లే సిగ్గు పడేలా.. బిలియన్ డాలర్ కార్పొరెట్ ప్రపంచానికి అవమానం మిగిలేలా కేరళ వరదలకు కోటి సాయం ప్రకటించి లారెన్స్ అతిపెద్ద షాకిచ్చాడు. అప్పట్లో చెన్నయ్ వరదల వేళ రజనీకాంత్ - కమల్ హాసన్ లాంటి వాళ్లకే గుండెపోటు వచ్చేలా కోటి ప్రకటించి ప్రకంపనాలకు కారకుడైన లారెన్స్ పొరుగున ఉన్న కేరళకు మరోసారి కోటి ప్రకటించి షాకిచ్చాడు. గొప్ప ఆదరణ ఉన్న ఇలయదళపతి విజయ్ 75లక్షలు ప్రకటించాడని గొప్పగా చెప్పుకుంటున్న వేళ లారెన్స్ పెద్ద మనసు అందరినీ హత్తుకుంది. అది మర్చిపోక ముందే మరో ప్రకటన అలాంటిదే.
అయితే ఈసారి ఆ ప్రకటన ఓ బాలీవుడ్ యువ హీరో నుంచి. ఉత్తరాది సినీపరిశ్రమలో ఖాన్ లు ఎందరు ఉన్నా.. కిలాడీలు - దేవగన్ లు ఉన్నా... ధావన్ బోయ్ - సిన్హాలు - బచ్చన్ లు ఉన్నా.. వీళ్లెవరూ ప్రకటించని సాయం ప్రకటించి ది గ్రేట్ హీరో అని నిరూపించాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. కేరళకు సుశాంత్ సింగ్ కోటి విరాళం ప్రకటించి.. తన మనుషుల్ని సాయానికి పంపాడు. మానవత అంటే ఇదీ అని నిరూపించాడు. కోటి ప్రకటించిన లారెన్స్ అది మాత్రమే సరిపోదు.. నా మనుషుల్ని పంపించి వరద బాధితులకు సాయమందిస్తున్నానని ప్రకటించినట్టే, సుశాంత్ కూడా స్ఫూర్తి పొంది ఇలా ప్రకటించాడని అనిపిస్తోంది. నిండా మునిగిన వాడి పెయిన్ నేరుగా చూసేవాడికే తెలుస్తుందని ఈ హీరోలు చెప్పకనే చెప్పారు. ఆ పెయిన్‌ని బిలియన్ డాలర్ సెలబ్రిటీ ప్రపంచం పెద్దంతగా గ్రహించినట్టు లేదు. ఖాన్ లు మానవసాయం అడిగారంతే... ఒక్క షారూక్ ఖాన్ మాత్రం `మీర్ ఫౌండేషన్` తరపున 21లక్షలు ప్రకటించి చేతులు దులిపేసుకున్నాడు. ఇతరత్రా ఖాన్‌లు ఏం సాయం చేశారో ఎవరకీ తెలీదు. బచ్చన్ ల సాయం గురించి ఎవరూ వినలేదింకా.