బాలీవుడ్ లో మంచి చాన్సులు దక్కించుకోవాలంటే చాలా మంది మొదట హిందీ సీరియల్స్ లో తెగ ట్రై చేస్తూ ఉంటారు. నార్త్ సైడ్ లో తీసే సీరియల్స్ కి నేషనల్ పాపులారిటీ ఉందన్న విషయం తెలిసిందే. దీంతో కొంత మంది కుర్ర హీరోలు బాలీవుడ్ లో స్టార్ గా ఎదగాలంటే.. ముందుగా సీరియల్స్ లో టాలెంట్ ను నిరూపించుకొని ఆ తర్వాత సినిమాల్లో ట్రై చేస్తారు. అదే దారిలో వచ్చి బాలీవుడ్ కి పరిచయమైనా హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్.
దాదాపు ఐదేళ్లు బుల్లితెరలో ఆకట్టుకున్న ఈ హీరో 2008 లో "కాయ్ పో చే" సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత "పికె" వంటి సినిమాల్లో నటించి ఏకంగా ధోని బయోపిక్ లో నటించి స్టార్ గా ఎదిగాడు. అయితే అతను రీసెంట్ గా ఎన్నడూ ఊహించని విధంగా ‘రాబ్తా’ సినిమాతో పెద్ద అపజయాన్ని అందుకున్నాడు. అప్పటి నుండి కథలను జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడు. అయితే ఇటీవల అతను కొన్ని కారణాల వల్ల ఓ సినిమా కు తీసుకున్న అడ్వాన్స్ ని తిరిగి ఇచ్చేశాడట.
‘రా’ (రెమో అక్బర్ వాల్టర్) అనే కథకు కొన్ని నెలల క్రితం ఒకే చేసిన సుశాంత్ ఎందువల్లనో తెలియదు గాని మొత్తానికి నేను ఈ సినిమాను చేయలేనని అడ్వాన్స్ గా తీసుకున్న నాలుగు కోట్లను నిర్మాతకు ఇచ్చేశాడట. బహుశా ఆ కథ మీద హీరో కాస్త అనుమానంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ హీరో కేదార్‌నాథ్’, ‘చందమామ దూర్ కే’ చిత్రాల్లో నటిస్తున్నారు. కేదార్ నాథ్ సినిమాలో సైఫ్ ఆలీ ఖాన్ కూతురు సారా ఆలి ఖాన్ హీరోయిన్ గా తెరంగేట్రం చేస్తోంది.