అఫైర్ ను పూర్తిగా రివీల్‌ చేసింది

Update: 2018-11-27 12:26 GMT
మాజీ విశ్వ సుందరి సుష్మిత సేన్‌ బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా ఒకప్పుడు వెలుగు వెలిగిన విషయం తెల్సిందే. అయితే ప్రస్తుతం సుష్మితకు సినిమాల్లో పెద్దగా ఆఫర్లు లేవు. ప్రస్తుతం ఫ్యామిలీతో సుష్మిత ఎంజాయ్‌ చేస్తోంది. పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని తల్లి అయిన సుష్మిత సేన్‌ ఇప్పటి వరకు ఎంతో మందితో ప్రేమలో మునిగి తేలిందని, సహజీవనం సాగించిందని వార్తలు వచ్చాయి. అయితే సుష్మిత సేన్‌ ఎప్పుడు కూడా వారితో మరీ క్లోజ్‌ అవ్వలేదు. కాని ఈసారి మాత్రం సుష్మిత సేన్‌ తన తాజా ప్రియుడు రొహమన్‌ షావల్‌ తో చాలా క్లోజ్‌ గా ఉంటుంది.

గత కొన్నాళ్లుగా వీరి ప్రేమ విషయమై మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను సుష్మిత సేన్‌ పట్టించుకోకుండా - స్పందించకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. రొహమన్‌ షావల్‌ తో కలిసి ఉన్న ఫొటోలు పెడతూ మెల్ల మెల్లగా ఇద్దరం రిలేషన్‌ షిప్‌ లో ఉన్నట్లుగా చెప్పకనే చెబుతూ వచ్చింది. తాజాగా అతడితో ఉన్న తన రిలేషన్‌ పై ఫుల్‌ క్లారిటీ ఇచ్చింది. ఇన్ని రోజులు కాస్త డౌట్‌ ఉండేది. తాజాగా సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్న ఫొటోలు సుష్మిత, రొహమన్‌ లు లివింగ్‌ రిలేషన్‌ లో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నారని తేల్చి పారేశాయి.

సుష్మిత సేన్‌ బర్త్‌ డేను రొహమాన్‌ దుబాయిలో గ్రాండ్‌ గా నిర్వహించాడు. పిల్లలతో కలిసి వీరు దుబాయికి వెళ్లారు. అక్కడ జరిగిన పార్టీకి సంబంధించిన ఫొటోలను సుష్మిత సేన్‌ పోస్ట్‌ చేసింది. ఆ ఫొటోల్లో సుష్మిత, రొహమాన్‌ చాలా క్లోజ్‌ గా ఉన్నారు. ఇప్పటి వరకు అలాంటి ఫొటోలను పోస్ట్‌ చేయని సుష్మిత తాజాగా వాటితో తమ మద్య సంబంధంను పూర్తిగా రివీల్‌ చేసింది. తన జీవితంలోకి రొహమాన్‌ వచ్చాక జీవితం చాలా సంతోషంగా సాగుతుందని సుష్మిత కామెంట్‌ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎంతో మందితో సహజీవనం సాగించిన సుష్మిత ఈసారి కూడా పెళ్లి చేసుకోకుండా కేవలం సహజీవనం వరకే ఈ వ్యవహారంను సాగిస్తుందని బాలీవుడ్‌ వర్గాల వారు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News