‘సుస్మిత’ ఇప్పుడక్కడ జడ్జి

Update: 2017-01-27 04:49 GMT
తన అందంతో దేశానికి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చి పెట్టిన భామగా సుస్మితా సేన్ ను చెప్పాలి. అన్ని దేశాలకు అందాల కిరీటాలు లభించినా.. మన అందానికి సరైన గుర్తింపు లభించటం లేదన్న లోటును భారతీయులు ఫీలవుతున్న వేళ.. మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకొని.. భారత అందం సత్తాను ప్రపంచ వేదిక మీద ప్రదర్శించిన సుస్మితా సేన్ కు తాజాగా మరో గుర్తింపు లభించింది.

1994లో మిస్ యూనివర్స్ గా అవతరించిన ఆమె.. తర్వాతి కాలంలో బాలీవుడ్ లో హీరోయిన్ గా పలు అవకాశాలు దక్కించుకున్నారు. కొద్దికాలంగా ఆమెకు బాలీవుడ్ లో సరైన అవకాశాలు లభించటం లేదనే చెప్పాలి. అందరూ సుస్మితను మర్చిపోతున్న వేళ.. ఆమెను విజేతగా ప్రకటించిన మిస్ యూనివర్స్ వేదిక మాత్రం ఆమెను మర్చిపోలేదు.

మిస్ యూనివర్స్ విజేతగా అవతరించిన23 ఏళ్ల తర్వాత సుస్మితకు అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 30న జరిగే మిస్ యూనివర్స్ అందాల పోటీ న్యాయనిర్ణేతల ప్యానల్ లో ఆమె పాల్గొనాల్సిందిగా ఇన్విటేషన్ పంపారు. ఏ వేదిక మీద అయితే విజయం సాధించారో.. అదే వేదికకు న్యాయ నిర్ణేతల్లో ఒకరిగా అవకాశంలభించటంపై సుస్మిత ఎగ్జైట్ అవుతున్నారు. ఈ ఆహ్వానం ఆనందాన్నే కాదు.. ఆశ్చర్యాన్ని కలిగించిందని చెబుతున్నారు. ఫిలిప్పీన్స్ లోని మనీలాలో ‘‘మాల్ ఆఫ్ ఏసియా మెరీనా’’ ఈ అందాల పోటీకి వేదిక కానుంది. ఇంత గుర్తింపు పొందిన మన అందానికి కంగ్రాట్స్ చెబుదామా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News