థియేట‌ర్ ఓన‌ర్ కొడుకు అనుమానాస్ప‌ద మృతి

Update: 2020-01-08 04:02 GMT
ఇటీవ‌ల సినీసెలబ్రిటీల మ‌ర‌ణ వార్త‌లు.. యాక్సిడెంట్లు క‌ల‌వ‌ర‌పెడుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా సాయి సినిమా ధియేటర్ యాజమాని తనయుడు మనోజ్ కుమార్ అనుమానాస్పద మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపింది. మృతుని వివ‌రాల్లోకి వెళితే..

రాయచోటి పట్టణం బ్రాహ్మణ వీధికి చెందిన సినిమా ధియేటర్ యాజమాని సాయినాథ్ గుప్తా తనయుడు మనోజ్ కుమార్ ఈ మంగ‌ళ‌వారం ఉదయం సమయంలో అనుమానాస్పద స్థితి లో మృతి చెందారు. మనోజ్ గతంలో మన్మధుడు2- NGK- బందో బస్తు‍‍-సీత-వాల్మీకి..లాంటి అనేక సినిమాలు కడప..కర్నూల్ జిల్లాలకు డిస్ట్రిబ్యూటర్ గా విడుదల చేశారు అని తెలిసింది.

యువ పంపిణీదారుని మ‌ర‌ణం ఆ కుటుంబం లో తీవ్ర విషాదం నింపింది. 2019 ఆద్యంతం ర‌క‌ ర‌కాల విషాద వార్త‌లు క‌ల‌చివేశాయి. కొత్త ఏడాది ఆరంభ‌మే కొన్ని మ‌ర‌ణ వార్త‌లు క‌ల‌చి వేస్తున్నాయి.
Tags:    

Similar News