సర్కారు వారి పాట కూడా భీమ్లా నాయక్ ను బీట్‌ చేయలేదు

Update: 2022-05-09 02:30 GMT
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు భారీగా హైప్ వచ్చింది. కొన్ని కారణాల వల్ల జనాలు ప్రీ రిలీజ్‌ ఈవెంట్ ను డైరెక్ట్‌ గా లేదా యూట్యూబ్‌ ద్వారా లేదా టీవీల్లో లైవ్ చూడాలని కోరుకున్నారు. అందుకే భీమ్లా నాయక్ సినిమా యూట్యూబ్‌ లో అత్యధిక లైవ్ స్ట్రీమింగ్‌ ను దక్కించుకుని రికార్డును నమోదు చేసింది. ఆ  తర్వాత చాలా పెద్ద సినిమాలు వచ్చాయి కాని ఆ రికార్డు బ్రేక్ కాలేదు.

ఆర్ ఆర్‌ ఆర్‌ మరియు రాధేశ్యామ్‌ సినిమాలు భీమ్లా నాయక్ రికార్డును బీట్‌ చేయలేక పోయాయి. అంతే కాకుండా ఇటీవల వచ్చిన ఆచార్య అంతకు ముందు వచ్చిన ఇతర సినిమాలు ఏవి కూడా భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ లైవ్ స్ట్రీమింగ్‌ రికార్డును బ్రేక్ చేయడంలో విఫలం అయ్యాయి. సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఆ రికార్డును బ్రేక్‌ చేస్తుందని అంతా భావించారు. కాని భీమ్లా నాయక్ రికార్డు బ్రేక్ కాలేదు.

సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా యూట్యూబ్‌ లో భారీగానే చూశారు. కాని భీమ్లా నాయక్ లైవ్‌ ను చూసినంత మంది మాత్రం సర్కారు వారి పాట సినిమా ప్రీ రిలీజ్ వేడుకను చూడలేదు అని చెప్పాలి. రికార్డు బ్రేకింగ్ వ్యూస్ ను దక్కించుకున్న సర్కారు వారి పాట కొద్ది లో భీమ్లా నాయక్‌ వ్యూస్ రికార్డును మిస్‌ చేసుకుంది అంటూ సోషల్‌ మీడియా జనాలు చెబుతున్నారు.

పవన్‌ కళ్యాణ్ భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ తక్కువ యూట్యూబ్‌ ఛానల్స్ లో స్ట్రీమింగ్‌ అవ్వడం తో పాటు ఎక్కువ ఆసక్తి ఉండటం వల్ల ఎక్కవ మంది లైవ్‌ స్ట్రీమింగ్‌ చేసిన రికార్డు ను దక్కించుకున్న ఘనత దక్కిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక సర్కారు వారి పాట సినిమా విషయానికి వస్తే ఈనెల 12వ తారీన విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. మహేష్‌ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్‌ గా ఈ సినిమాలో నటించగా పరశురామ్‌ దర్శకత్వం వహించాడు. మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్‌ బ్యానర్ ల్లో ఈ సినిమా రూపొందింది. మహేష్ బాబు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాడు.
Tags:    

Similar News