ఈ విపత్తు సమయంలో బాలీవుడ్ సినీ ప్రముఖులు పలువురు తమకు తోచిన సాయం చేసి మంచితనంను మానవత్వంను చాటుకున్నారు. పని లేని కార్మికుల కోసం నిత్యావసరాలను సరఫరా చేస్తూ సల్మాన్ ఖాన్ రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇంకా పలువురు సెలబ్రెటీలు కూడా తమకు తోచిన సాయంను చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. ఈ సమయంలో కార్మికులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన ఎంతో మంది సెలబ్రెటీలు మంచి మనసున్న వారిగా నిలిచారు.
తాజాగా నటి స్వర భాస్కర్ కూడా దిల్లీలో ఉన్న కార్మికులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఆమె సాయం చేసేందుకు వెళ్లిన సమయంలో పలువురు కార్మికులు కనీసం పాదరక్షలు కూడా లేకుండా నడుస్తుండటంను గమనించింది. దాంతో ఆమె సల్మాన్ ఖాన్ కు ఫోన్ చేసి ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న రిలాక్సో నుండి కార్మికులకు పాదరక్షలు ఇప్పించాలంటూ విజ్ఞప్తి చేసింది. వెంటనే సల్మాన్ ఖాన్ రిలాక్సో సీఈవోతో మాట్లాడి స్వర భాస్కర్ సమాచారం ఇచ్చి ఇద్దరిని సమన్వయ పర్చాడు.
సల్మాన్ ఖాన్ చెప్పడంతో రిలాక్సో సీఈఓ కార్మికులకు ఉచితంగా పాదరక్షలను పంపించడం జరిగింది. వాటిని కార్మికులకు స్వయంగా స్వర భాస్కర్ పంచిపెట్టారు. ఈ విపత్తు సమయంలో ప్రతి ఒక్కరు కూడా తమకు తోచిన సాయంను చేస్తూ ఉండటం నిజంగా అభినందనీయం. మానవత్వం ఇంకా బతికే ఉందనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.