పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పుల్వామాలో చేసిన ఉగ్ర దాడికి ఇండియా సరైన ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ భూ భాగంలోకి వెళ్లి మరీ అక్కడ దాకుని ఉన్న ఉగ్రవాదులను మట్టు పెట్టడం జరిగింది. సర్జికల్ స్ట్రైక్ 2 గా జరిగిన ఈ ఆపరేషన్ అత్యంత రహస్యంగా జరిగింది. జరిగిన తర్వాత బయట ప్రపంచంకు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో పుల్వామా ఘటనకు సమాధానం ఇస్తామంటూ ముందు నుండే చెబుతూ వచ్చింది. అన్నట్లుగానే ఉగ్రవాదుల స్థావరాలను ముఖ్యంగా జైషే మహ్మద్ టెర్రర్ ట్రైనింగ్ క్యాంపులను నేలమట్టం చేయడం జరిగింది. ఇందంతా కూడా కేవలం 21 నిమిషాల్లోనే జరిగింది.
కేవలం 21 నిమిషాల్లో ఎయిర్ ఫోర్స్ జరిపిన దాడిలో దాదాపుగా 350 మంది వరకు చనిపోయారట. ఈ దాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు మంత్రులు మరియు ఆర్మీ ఉన్నతాధికారులు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు నిమిషం నిమిషం చర్చలు జరుపుతూ వచ్చారట. ప్రధాని నరేంద్ర మోడీ రాత్రి నుండి తెల్లవారు జామున ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ద విమానాలు తిరిగి వచ్చేవరకు అంటే దాదాపు తెల్లవారు జామున 4 గంటల వరకు ప్రతి విషయాన్ని ఉన్నతాధికారులతో చర్చిస్తూ గడిపారట. యుద్ద విమానాలు తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు విశ్రాంతి తీసుకున్నారట.
ఈ విషయమై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ చేసిన వ్యాఖ్యలు దుమారంను రేపుతున్నాయి. రాత్రంతా మోడీ నిద్రలేకుండా ఆపరేషన్ ను పర్యవేక్షించారంటూ మీడియాలో వస్తున్న వార్తలకు ఆమె స్పందిస్తూ.. ఇందులో గొప్పేముంది - అది ఆయన డ్యూటీ కదా అంటూ ట్వీట్ చేసింది. నిజమే ప్రధానిగా మోడీ ఆ బాధ్యతలను చూసుకోవాలి. కాని ఇలాంటి సమయంలో స్వర భాస్కర్ ఆ వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కావు అంటూ నెటిజన్స్ మండి పడుతున్నారు. ఎవరి డ్యూటీ వారు సక్రమంగా చేయడం లేదు. మోడీ గారు ఆయన డ్యూటీని సక్రమంగా చేశారు, అందుకు అభినందించాల్సింది పోయి డ్యూటీనే కదా చేసిందని తీసి పారేయడం ఏంటీ అంటూ స్వరను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.