ఎత్తు మ‌డ‌మ‌లు తెచ్చిన‌ తంటా..అయ్యో పాపం!

Update: 2019-09-20 15:55 GMT
ఎంత ఎత్తు మ‌డ‌మ‌ల చెప్పులు తొడిగితే మాత్రం అంత టెక్కు అవ‌స‌ర‌మా? ఎవ‌రైనా అంద‌గ‌త్తె హైహీల్స్ ధ‌రించి క‌ళ్ల ముందు న‌డిచెళితే కుర్రాళ్ల ఫీలింగ్ ఇదీ. పాపం ఈ అమ్మ‌డు తెలిసో తెలియ‌కో అలా హైహీల్స్ ట్రై చేసి అడ్డంగా బుక్క‌య్యింది.

ముంబైలో ఐఫా 2019 ఈవెంట్ క‌న్నుల పండుగ‌గా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ వేడుక‌లో స్టార్లు అంతా ఎవ‌రికి వారు గ్రీన్ కార్పెట్ .. రెడ్ కార్పెట్ న‌డ‌క‌ల‌తో ఉర‌క‌లెత్తించారు. సోగ్గ‌త్తెల వ‌య్యారం క‌ళ్లు తిప్పుకోనివ్వ‌లేదంటే అతిశ‌యోక్తి కాదు. ఇంత పెద్ద ఈవెంట్లో ఒక దృశ్యం మాత్రం జ‌నాల క‌ళ్ల‌ను తిప్పుకోనివ్వ‌లేదు.

ఎత్తుగా క‌న‌బ‌డాలి. అందంగా ఉండాలి అనుకుందేమో పాపం బాలీవుడ్ న‌టి స్వ‌రా భాస్క‌ర్ హైహీల్స్ ట్రై చేసింది. స్ట‌న్నింగ్ అనిపించాల‌ని .. లేక ఇంకేదో అవ్వాల‌ని డిజైన‌ర్లు త‌నని అలా ప్రోత్స‌హించార‌ట‌. అయితే అవి సౌక‌ర్యంగా లేక ఇర్రిటేష‌న్ తెప్పించ‌డంతో అలా కార్పెట్ పై న‌డిచెళుతూనే ఆ ఫేస్ ని అదోలా పెట్టింది. ఆ చెప్పుల్ని తొల‌గించి అవ‌త‌లికి గిరాటేసింది. ఆ దృశ్యాల్ని కెమెరాలు బంధించాయి.

హైహీల్స్ ధ‌రించిడం త‌ప్పు కాదు. అయితే అవి సౌక‌ర్యంగా ఉండాలి. ఒక ఛాయిస్ గా ఉండాలి త‌ప్ప అలా హై హీల్స్ వేస్తేనే అందంగా ఉంటామా అనేది ఆలోచించాలి... అని ఫ్యాష‌నిస్టులు క్లాస్ తీస్కుంటున్నారు. ఇంత‌కుముందు ఫేమ‌స్ హాలీవుడ్ స్టార్ క్రిస్టెన్ స్టివార్ట్ కూడా ఇంత‌కుముందు ఇలానే ఇబ్బందికి గురైంది. రెడ్ కార్పెట్ పై హీల్స్ తీసేసి చిరాకు ప‌డింది. అటుపై ఇదేం చెత్త ప‌ని ఈ డ్రెస్ కోడ్స్ రూల్స్ ఏంటి అంటూ ఓ ఉద్య‌మాన్ని చేప‌ట్టింది. ఇలాంటి సింగారాలేవీ అవ‌స‌రం లేదంటూ కొట్టిపారేసింది.

ఫ్యాష‌న్ విష‌యంలో యూత్ ఒక‌టి మాత్రం అర్థం చేసుకోవాలి. సౌక‌ర్యంగా లేని వాటిని ఎప్పుడూ ఫ్యాష‌న్ కోసం నెత్తిన రుద్దుకోకూడ‌దు. హీల్స్ తో న‌డ‌వ‌డం అన్న‌ది ఎంత క‌ష్ట‌మో కూడా ముందుగా గుర్తించాలి. ఆ ఇబ్బంది స్వ‌రాకు ఎదురైంద‌ని ఆ ఎక్స్ ప్రెష‌న్ క్లియ‌ర్ క‌ట్ గా చెబుతోంది. ఆ ప్లేస్ లో ఉంటే మ‌నం కూడా అలానే పీల‌య్యేవాళ్ల‌మేమో. అందుకే ఆడాళ్లు న‌చ్చిన‌వి వేసుకుని సౌక‌ర్యంగా ఉండ‌డ‌మే అవ‌స‌రం. రెడ్ కార్పెట్ ఈవెంట్లలోనే కాదు వేడుక‌లకు వెళ్లినా జాగ్ర‌త్త అవ‌స‌రం అని చెబుతోంది ఈ సీన్.
Tags:    

Similar News