ఈమద్య కాలంలో బాలీవుడ్ లో స్వర భాస్కర్ గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. ఈ అమ్మడు చేస్తున్న బోల్డ్ పాత్రలు మరియు బోల్డ్ సోషల్ మీడియా పోస్ట్ ల కారణంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్ లో ఈమె నటించినవి కొన్ని సినిమాలే అయినా కూడా స్టార్ హీరోయిన్ రేంజ్ లో ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కించుకుంది. తను వెడ్స్ మను - ప్రేమ్ రతన్ ధన్ పాయో - వీరి ది వెడ్డింగ్ చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ఈమె సౌత్ పై ఆసక్తి చూపుతున్నట్లుగా అనిపిస్తుంది.
బాలీవుడ్ హీరోయిన్స్ పలువురు ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ క్లబ్ లో చేరిన విషయం తెల్సిందే. తాజాగా స్వర భాస్కర్ కూడా తాను ప్రభాస్ కు పిచ్చ ఫ్యాన్ అంటూ చెప్పేసింది. ప్రభాస్ నటించిన ‘బాహుబలి 1’ చిత్రంను 9 సార్లు - బాహుబలి 2 చిత్రాన్ని 8 సార్లు చూసినట్లుగా చెప్పుకొచ్చింది. బాహుబలి చూస్తున్న సమయంలో ప్రభాస్ కు పడిపోయాను. ప్రభాస్ తో కలిసి నటించేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. తెలుగులో సినిమాలు చేయాలనే ఆసక్తిని ఈమె కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది.
స్వర భాస్కర్ తండ్రి ఉదయ్ భాస్కర్ చిత్రపు నేవీ ఆఫీసర్. ఈయన వైజాగ్ కు చెందిన వ్యక్తి. అందుకే స్వర భాస్కర్ చిన్నతనం వైజాగ్ లో గడిచింది. తెలుగుపై ప్రత్యేకమైన ఇష్టం ఉన్న స్వరా భాస్కర్ కు తెలుగు సినిమాల్లో ‘శివ’ మరియు ‘చంటి’ చిత్రాలు అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి ఆఫర్లు వస్తున్నప్పటికి తెలుగు నుండి మంచి కథతో వస్తే తప్పకుండా నటిస్తాను అంటూ ప్రకటించింది. ప్రభాస్ తో ఛాన్స్ వస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించను అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్వర భాస్కర్ తన మనసులోని మాటలను చెప్పేసింది.