పైశాచికాన్ని బయట పెట్టిన హీరోయిన్

Update: 2017-04-30 06:14 GMT
స్త్రీని దేవతలా చూసే దేశంలో మనం ఉంటున్నాం. కానీ ప్రతీ ఇల్లు ప్రతీ వీధి ప్రతీ ఊరు ఎక్కడైనా స్త్రీకి దక్కుతున్న గౌరవం పుస్తకాలలో చెప్పినట్లు లేదు. స్కూల్ కాలేజీ వర్క్ ప్లేస్ పబ్లిక్ ప్లేస్ హోం రోడ్ మార్కెట్ ఇలా ఎక్కడైనా కూడా ఆడవాళ్ళపై అగాయిత్యాలు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఏ చొటైనా ఏ స్థాయైన ఆడవాళ్ళయినా.. ఇబ్బందులు పడుతున్నారు. ఇక మామూలు ఆడవాళ్ళే ఇంతలా భాదపడుతుంటే మరి గ్లామర్ ఇండస్ట్రి లో ఉన్న ఆడవాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది.

‘నిల్ బట్టే సన్నాట’ హీరోయిన్ స్వర భాస్కర్ కూడా ఓ చేదైన పరిస్థితి ఎదుర్కొంది. ''ముంబాయి లోకల్ ట్రైన్ లో ఒక సారి డ్రగ్స్ కు బానిసైన ఒకడు నన్ను అసభ్యకరంగా ముట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా.. నా ముందు తన అంగాన్ని బయటకు తీసి హస్త ప్రయోగం చేసుకోవడం మొదలెట్టాడు. అప్పుడు వాడి కాలర్ పట్టుకొని నా దగ్గర ఉన్న గొడుగుతో చితకబాదాను. పోలీసులుకు చెప్పే లోపే వాడు అది గ్రహించి నన్ను విడిపించుకొని పారిపోయాడు'' అంటూ చెప్పింది స్వర.

ఎక్కడో లోకల్ ట్రైన్ లోనే కాదు..సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షూటింగ్ లో కూడా అక్కడకు వచ్చినా జనాలు తో మేము వాళ్ళ వికృత పనులుకు ఇబ్బందిపడిన సంధార్భాలు చాలా ఉన్నయి అని చెప్పింది. ప్రేమ రతన్ ధన పాయో సినిమా ప్రమోషన్ కోసం వెళ్తున్నప్పుడు ఎయిర్ పోర్టులో కూడా ఈమెను ఆకతాయి తాకరాని చోట తాకారట. మన సమాజం ఎప్పుడు మారుతుంది గురూ? ఈ పైశాచికత్వం ఏంటసలు? ఆలోచించండి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News