బాలీవుడ్ ను తెగ ఇబ్బంది పెడుతున్న పదం బాయ్ కాట్. గత రెండు సంవత్సరాలుగా బాలీవుడ్ సినిమాలకు ఇది పెద్ద చిరాకు తెప్పించే విషయంగా మారిపోయింది. ఇండస్ట్రీలో కొందరి సినిమాలను.. కొందరిని బాయ్ కాట్ చేయాల్సిందే అంటూ సోషల్ మీడియాలో బాయ్ కాట్ బ్యాచ్ చేస్తున్న ఆందోళన మొత్తం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ పై పడుతుంది అంటున్నారు.
హిందీ సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులకు ఈ బాయ్ కాట్ ఎఫెక్ట్ తప్పడం లేదు. త్వరలో విడుదల కాబోతున్న బ్రహ్మాస్త్ర సినిమా కి కూడా బాయ్ కాట్ దెబ్బ తప్పలేదు. సోషల్ మీడియాకి చెందిన చాలా మంది బ్రహ్మాస్త్ర ను బాయ్ కాట్ చేయాలంటూ హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్ మరియు ఇతర సోషల్ మీడియా ల్లో తెగ ట్రెండ్ చేస్తున్నారు.
ఈ సమయంలో బాయ్ కాట్ విషయమై బాలీవుడ్ హాట్ బ్యూటీ స్వర భాస్కర్ స్పందించింది. ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాయ్ కాట్ అనేది సినిమా ల యొక్క వసూళ్ల పై ఎంత వరకు ప్రభావం చూపిస్తుందో నాకు తెలియదు. కానీ సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతి చెందిన సమయంలో కొందరు ఆయన మరణం ను వ్యక్తిగతంగా తీసుకుని తమ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నం చేశారు.
అప్పుడు చాలా మంది ఆలియా భట్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో పాటు బాయ్ కాట్ డిమాండ్ చేశారు. అయినా కూడా ఆమె నటించిన గంగూ బాయ్ సినిమాకు మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. ఆ సినిమాను బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చినా కూడా ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం అందరూ చూశారు.
కొందరు కావాలని ఇండస్ట్రీ నాశనం కోసం కంకణం కట్టుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆ గ్రూప్ కు చెందిన వారు ప్రతి సినిమాను మరియు ప్రతి నటీ నటులను కూడా బాయ్ కాట్ అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఒకప్పుడు కొందరి పై మాత్రమే ఉన్న విద్వేశం ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం పై వారు పెంచుకుని నాశనం కు ప్రయత్నిస్తున్నారంటూ స్వర భాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.