తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లకు ప్రాధాన్యం ఇవ్వరన్న విమర్శలు ఎప్పట్నుంచో ఉన్నాయి. కలర్స్ స్వాతి.. అంజలి.. శ్రీదివ్య.. ఆనంది లాంటి వాళ్లు తమిళంలో మంచి అవకాశాలు అందుకుంటున్న నేపథ్యంలో ఈ విమర్శలు సమంజసమే అనిపిస్తుంది. ముఖ్యంగా స్వాతి లాంటి టాలెంటెడ్ యాక్ట్రెస్ ను తెలుగు వాళ్లు సరిగా ఉపయోగించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయమై ఓ ఇంటర్వ్యూలో స్వాతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు తెలుగు సరిగా రానట్లుగా తాను షో చేస్తే ఎక్కువ అవకాశాలు వచ్చేవేమో అని ఆమె వ్యాఖ్యానించడం విశేషం. తెలుగేతర హీరోయిన్ లకు ఇక్కడ ఎక్కువ ప్రయారిటీ అనే విషయమై ఆమె ఇలా పంచ్ వేసిందన్నమాట. అలాగే పెద్దగా తెలివి లేనట్లుగా ఉండాలనే తెలివి తేటలు కూడా తనకు లేవని.. అదే సమస్య అయిందని స్వాతి మరో పంచ్ వేయడం గమనార్హం.
అయితే తనకు ఆశించిన స్థాయిలో అవకాశాలు ఇవ్వకపోయినా.. తాను తెలుగు సినిమాను తక్కువగా చూడనని.. తెలుగు సినిమాను తాను పూర్తిగా సపోర్ట్ చేస్తానని స్వాతి చెప్పింది. కలర్స్ ప్రోగ్రాం లోనే తనను జనాలు బాగా చూశారని.. అందుకే తాను సినిమాల్లో కొత్తగా కనిపించలేదేమో అని ఆమె సందేహం వ్యక్తం చేసింది. సినిమా అనేది వ్యాపారంతో ముడిపడిందని.. ఎవరిని తీసుకుంటే డబ్బులు ఎక్కువ సంపాదింవచ్చని అనుకుంటారో అలాంటివాళ్లనే సినిమాలకు ఎంచుకుంటారు కాబట్టి ఈ విషయంలో తాను మరీ ఎక్కువగా ఆలోచించనని ఆమె అంది.