శ్వేతా బసు ఏం చేసింది.. ఏం చేస్తోంది?

Update: 2016-10-16 15:30 GMT
శ్వేత బసు ప్రసాద్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. తాను చేసిన సినిమాలతో ఎంత పేరు తెచ్చుకుందో.. ఆ తర్వాత మూడేళ్ల కిందట ఓ కాంట్రవర్శీతో దానికి మించి వార్తల్లో నిలిచింది. ప్రాస్టిట్యూషన్ కేసులో చిక్కుకుని.. దాన్నుంచి క్లీన్ చిట్ తో బయటపడ్డాక ముంబయికి వెళ్లిపోయిన శ్వేత.. హైదరాబాద్ వైపు చూడటమే మానేసింది. ఈ మూడేళ్లలో ఆమె ఏం చేసిందో.. ఇప్పుడు ఏం చేస్తోందో మనవాళ్లకు పెద్దగా అవగాహన లేదు. ఐతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ కాంట్రవర్శీ తర్వాత తన కెరీర్లో ఏమేం చేశానో.. ఇప్పుడేం చేస్తున్నానో వివరించింది శ్వేత.

‘‘ముంబయి వెళ్లాక మా్‌స్ కమ్యూనికేషన్ కోర్సు చేశాను. ప్రస్తుతం నేను క్వాలిఫైడ్ జర్నలిస్టుని. తర్వాత శాస్త్రీయ సంగీతం మీద ‘రూట్స్’ పేరుతో ఓ డాక్యుమెంటరీ తీశా. ‘ఇంటీరియర్ కేఫ్ నైట్’ పేరుతో ఓ షార్ట్ ఫిలిం నిర్మించాను. నేను కూడా అందులో నటించాను. నసీరుద్దిన్ షా లాంటి గ్రేట్ ఆర్టిస్టు కూడా అందులో నటించారు. ఈ షార్ట్ ఫిలింకి 1 మిలియన్ పైనే హిట్స్ వచ్చాయి. వీటితో పాటు బాలాజీ టెలీ ఫిలింస్ వాళ్లు తీసిన ‘చంద్ర నందిని’ అనే సీరియల్లో కూడా నటించాను. ఇందులో నేను వారియర్ ప్రిన్సెస్‌.  ఈ పాత్ర కోసం గుర్రపు స్వారీలు, కత్తి యుద్ధం నేర్చుకున్నాను. కరణ్ జోహార్ సినిమా ‘బద్రీనాథ్ కీ దుల్హనియా’లో నటిస్తున్నాను. ఈ మూడేళ్లలో తెలుగులో కనిపించకపోయినా బిజీగానే ఉన్నాను. ఈ మధ్యే దర్శకుడు సతీష్ కలసి ‘మిక్చర్ పొట్లం’ కథ చెప్పారు. కథ నచ్చడంతో ఒప్పుకున్నాను. ఒక నటిగా నా దగ్గరికి ఏ మంచి ప్రాజెక్టు వచ్చినా ఒప్పుకుంటాను’’ అని శ్వేత చెప్పింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News