సెన్సార్ రిపోర్ట్: సైరా సర్వం సిద్ధం

Update: 2019-09-23 12:06 GMT
మెగా ఫ్యాన్స్ అక్టోబర్ 2 కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో చెప్పనక్కర్లేదు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. టైటిల్ సాంగ్ కూడా ధీటుగా ఉండటంతో రికార్డుల ఊచకోత ఖాయమనే లెక్కలో ట్రేడ్ సైతం భారీ నమ్మకంతో ఉంది. ఇదిలా ఉండగా సైరా నరసింహారెడ్డి సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. బోర్డు అధికారులు యు/ఎ ఇచ్చారు.

బ్రిటష్ సైన్యాన్ని ఊచకోత కోసే సన్నివేశాల్లో సహజంగానే హింస తప్పదు కాబట్టి వాటికోసం ఏ ఇచ్చినట్టు అర్థమవుతోంది. నిడివికి సంబంధించి కూడా మరో ఆసక్తికరమైన అప్ డేట్ బయటికి వచ్చింది. లెంత్ ఎంత ఉంటుందా అనే సస్పెన్స్ కు తెరదించారు . సైరా ఫైనల్ వెర్షన్ 164 నిముషాలు కొన్ని సెకండ్లు వచ్చింది. అంటే 2 గంటల 45 నిమిషాలకు లాక్ అయ్యిందన్న మాట.

ఇలాంటి చారిత్రాత్మక చిత్రానికి ఇది చాలా రీజనబుల్ లెంత్ అని చెప్పొచ్చు. నిజానికి అందరూ కనీసం మూడు గంటల నిడివిని ఆశించారు. అయితే ఎడిటింగ్ విషయంలో కొణిదెల టీం తీసుకున్న జాగ్రత్త వల్ల ఎక్కువ ల్యాగ్ లేకుండా జాగ్రత్త పడినట్టు అర్థమవుతోంది. అక్టోబర్ 2 తెలుగు - హింది - కన్నడ -మలయాళం - తమిళ్ లో భారీ ఎత్తున విడుదల కానున్న సైరా నరసింహారెడ్డి అడ్వాన్సు బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో ఇంకో రెండు మూడు రోజుల్లో మొదలుపెట్టేస్తారు. ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకోవడమే మన పని.


Tags:    

Similar News