ఫ్యాక్ట్ షీట్‌: 'సైరా' డిజిట‌ల్ శాటిలైట్ రైట్స్

Update: 2019-09-21 05:42 GMT
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన `సైరా-న‌ర‌సింహారెడ్డి` అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతి కానుక‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజ‌వుతోంది. తెలుగు - త‌మిళం - హిందీ - క‌న్న‌డం - మ‌ల‌యాళంలో భారీగా రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా థియేట్రిక‌ల్ బిజినెస్ గురించి.. శాటిలైట్ డిజిట‌ల్ రేంజ్ గురించి ర‌క‌ర‌కాల ప్ర‌చారం సాగుతోంది. 

సైరా డిజిట‌ల్ రైట్స్ .. శాటిలైట్ రైట్స్ గురించి ఇదివ‌ర‌కూ క‌థ‌నాలొచ్చాయి. దాదాపు 125కోట్లు చెల్లించి ఓ ప్ర‌ముఖ ఎంట‌ర్ టైన్ మెంట్ చానెల్ అన్ని భాష‌ల డిజిట‌ల్- శాటిలైట్ హ‌క్కుల్ని చేజిక్కించుకుంద‌ని వార్త‌లొచ్చాయి. అయితే అది నిజం కాదని తెలుస్తోంది. సైరా ద‌క్షిణాది భాష‌ల వ‌ర‌కూ శాటిలైట్ రైట్స్ కోసం స‌న్ (జెమిని) నెట్ వ‌ర్క్ సంస్థ‌ 25 కోట్లు చెల్లించ‌నుంద‌ట‌. అయితే హిందీ వెర్ష‌న్ రైట్స్ మాత్రం మిన‌హాయింపు. అలాగే `సైరా` డిజిట‌ల్ రైట్స్ ను ప్ర‌ముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ దిగ్గ‌జం అమెజాన్ ప్రైమ్ రూ.50 కోట్లకు ద‌క్కించుకుంద‌ని తెలుస్తోంది.

సైరా న‌ర‌సింహారెడ్డి ట్రైల‌ర్ ఇటీవ‌లే రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఈ విజువ‌ల్ రిచ్ ట్రైల‌ర్ చూశాక మార్కెట్ వ‌ర్గాల్లోనూ పాజిటివ్ బ‌జ్ ఏర్ప‌డిందని తెలుస్తోంది. ముఖ్యంగా హిందీ ఆడియెన్ లోనూ సైరాకు క్రేజు పెరిగింది. ఇటీవ‌లే రిలీజైన `సాహో` హిందీలో స‌క్సెస‌వ్వ‌డం ఈ సినిమాకి పాజిటివ్ ఇంపాక్ట్ ని ఇస్తుంద‌నే అంచ‌నా వేస్తున్నారు.

   

Tags:    

Similar News