తమిళ్ లో అడుగు పెడుతున్న మెగాస్టార్

Update: 2018-12-26 17:30 GMT
టాలీవుడ్ వరకు మెగాస్టార్ అంటే చిరంజీవే కానీ అల్ ఇండియా లెవెల్ లో మాత్రం అమితాబ్ బచ్చనే. ఈ నిజాన్ని చిరు సైతం ఒప్పుకున్న సందర్భాలు ఎన్నో. అయితే ఇప్పటిదాకా ఈ ఇద్దరి కలయిక అసాధ్యం అనుకుంటున్న వాళ్లకు సైరా చెక్ పెట్టిన సంగతి తెలిసిందే. బిగ్ బి లుక్ తాలుకు ఫోటోలు మంచి స్పందన దక్కించుకున్నాయి. ఎలాగూ సైరా మల్టీ లాంగ్వేజెస్ లో డబ్ చేస్తారు కాబట్టి మనతో పాటు కన్నడ తమిళ మలయాళం ప్రేక్షకులు కూడా ఈ కాంబోని ఎంజాయ్ చేస్తారు.

కాగా అమితాబ్ మరో సౌత్ సినిమాతో జత కడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఖుషి డైరెక్టర్ గా మహేష్ బాబు స్పైడర్ విలన్ గా మనకు బాగా సుపరిచితుడు అయిన ఎస్ జే సూర్య హీరోగా రూపొందే ఉయరింద మనిదన్ లో అమితాబ్ ఒక స్పెషల్ రోల్ చేయబోతున్నారు. చర్చలు పూర్తయ్యాయని త్వరలొ సంచలనాత్మక ప్రకటన వస్తుందని సూర్య ప్రకటించాడు. హిందిలో గ్రేట్ మ్యాన్ పేరుతో ఇది రూపొందనుంది.

అయితే అమితాబ్ బచ్చన్ సౌత్ సినిమాల్లో కనిపించడం సైరాతో మొదలు కాదు. ఆ ఘనత ఇంతకు ముందు 2005లో ఓ కన్నడ సినిమా కొట్టేసింది. అమృత ధారే అనే మూవీలో అమితాబ్ చిన్న క్యామియోలో కనిపిస్తారు. ఇది తెలుగులో డబ్ అయ్యింది కాని ఆడలేదు. అక్కడ మాత్రం మంచి హిట్టే. సైరా సౌత్ సినిమాల్లో అమితాబ్ కు రెండోది. సూర్య మూవీ మూడోది అవుతుంది. అమితాబ్ తో చర్చల సందర్భంగా తీసుకున్న ఫోటోను ఎస్ జే సూర్య షేర్ చేసుకున్నాడు. హీరొయిన్లు టెక్నికల్ టీం తదితర వివరాలు ఎస్ జే సూర్య స్వయంగా ప్రకటించబోతున్నాడు. అయితే వచ్చే ఏడాది అమితాబ్ ని రెండు సార్లు సౌత్ స్క్రీన్ పై చూసుకోవచ్చన్న మాట.
Tags:    

Similar News