మెగా స్టార్ చిరంజీవి - విలక్షణ దర్శకుడు సురేందర్ రెడ్డి ల కాంబోలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం `సైరా నరసింహా రెడ్డి`పై టాలీవుడ్ లో భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు తమిళ నటుడు విజయ్ సేతుపతి - జగపతిబాబు - కిచ్చ సుదీప్ - నయనతార - తమన్నావంటి స్టార్ కాస్ట్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. బాహుబలి తర్వాత టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించి మోషన్ పోస్టర్ - చిరు-నయన్ - అమితాబల్ ల ఫొటో మినహా ఎటవంటి అప్ డేట్ రాలేదు. ఆ కొరత తీర్చేందుకు చిత్ర యూనిట్....త్వరలోనే `సైరా`టీజర్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. మెగాస్టర్ బర్త్ డేకు ఒక రోజు ముందే ఆయన ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చేందుకు చెర్రీ రెడీ అయ్యాడు.
`సైరా`టీజర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిరంజీవి బర్త్ డేకు ఒక రోజు ముందే మెగా ఫ్యాన్స్ కు `సైరా ` యూనిట్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 21న `సైరా` టీజర్ ను రిలీజ్ చేయబోతున్నామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈనెల 21న ఉదయం గం.11.30 లకు టీజర్ విడుదల కాబోతోంది. దీంతో - చిరు బర్త్ డే సందర్భంగా మెగా ఫ్యాన్స్ కు బర్త్ డే - టీజర్ రూపంలో డబుల్ ధమాకా లభించినట్లయింది. మరోవైపు, హైదరాబాద్ శివారులో సైరా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అంతకుముందు, ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన యుద్ధ సన్నివేశాల షెడ్యూల్ ను ...ప్రతికూల పరిస్థితుల్లోనూ...కేవలం 35 రోజుల్లో ముగించిన సంగతి తెలిసిందే.