మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' అక్టోబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 'సాహో' తర్వాత భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమా ఇదే. బహుభాషా చిత్రంగా రిలీజ్ అవుతున్న 'సైరా' అమెరికాలో కూడా అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ అవుతోంది. సినిమా రిలీజ్ అక్టోబర్ 2 న అయినప్పటికీ ప్రీమియర్స్ మాత్రం అక్టోబర్ 1 న ప్రదర్శిస్తారు.
ఈ సినిమా అమెరికాలో టికెట్ రేట్లు ఎలా ఉన్నాయనేదానిపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. తెలుగు వెర్షన్ ప్రీమియర్స్ విషయానికి వస్తే పెద్దవారికి $25 కాగా పిల్లలకు $15 గా ఫిక్స్ చేశారు. ఇతర భాషల ప్రీమియర్స్ కు పెద్దవారికి $15 కాగా పిల్లలకు $10 ఫిక్స్ చేయడం జరిగింది. ప్రీమియర్స్ పక్కన పెట్టి రెగ్యులర్ షోస్ టికెట్స్ సంగతి చూస్తే.. పెద్దవారికి $16 కాగా పిల్లలకు $10 టికెట్ రేట్ గా నిర్ణయించారు. ఇతర భాషల షోలకు పెద్దవారికి $12 కాగా పిల్లలకు $9 గా ఫిక్స్ చేశారు.
ఈ ప్రైసింగ్ చూస్తుంటే ప్రభాస్ 'సాహో' విషయంలో జరిగిన పొరపాటును 'సైరా' డిస్ట్రిబ్యూటర్స్ సరిదిద్దుకున్నట్టుగా అనిపిస్తోంది. 'సాహో' విషయంలో ఇతర భాషలకు టికెట్ రేట్లు ఎక్కువగా ఫిక్స్ చేయడంతో ప్రీమియర్స్.. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తగ్గాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి పొరపాటు జరగకుండా 'సైరా' టికెట్స్ విషయంలో జాగ్రత్తపడ్డారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.