దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ గ్రాండ్ సక్సెస్ వెనక ప్రచార ఎత్తుగడ ఎంతో కీలకంగా పని చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకి అంతర్జాతీయ సినిమా పండగల్లో చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. వీలున్న ప్రతి వేదికపైనా బాహుబలి పోస్టర్లు.. విజువల్స్ ని ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా క్రేజు తీసుకురాగలిగారు. రాజమౌళి- ఆర్కా మీడియా ఎత్తుగడ పెద్ద రేంజులో వర్కవుటైంది. అయితే ఆ తర్వాత మళ్లీ ఎన్ని భారీ చిత్రాలు రిలీజైనా ఆ స్థాయి హైప్ తెచ్చుకోవడంలో మాత్రం తడబడుతున్నాయనే చెప్పాలి.
ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు భారీ చిత్రాలు రిలీజ్ లకు రెడీ అవుతున్నాయి. ప్రభాస్ నటించిన సాహో.. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా- నరసింహారెడ్డి చిత్రాల్ని ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ లో ఎలాంటి సారూప్యతలు లేవు. ఎవరికి వారు సపరేట్ దారినే ఎంచుకున్నారు. సాహో చిత్రానికి ఇప్పటికే కొన్ని పోస్టర్లు.. టీజర్.. సాహో మేకింగ్ చాప్టర్1,2 లను రివీల్ చేశారు. వీటన్నిటికీ అంతర్జాలంలో అద్భుత స్పందన వచ్చింది. ఆగస్టు 15 రిలీజ్ సందర్భంగా అన్ని మెట్రో నగరాల్లో ప్రచార కార్యక్రమాల్ని రూపొందించిన సంగతి తెలిసిందే.
అయితే సాహో బృందంతో పోలిస్తే సైరా టీమ్ ప్రచారం పరంగా వెనకబడిందన్న భావనా మీడియాలో వ్యక్తమైంది. అందుకే దీని నుంచి బయటపడేందుకు కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ స్పష్టమైన ప్రణాళికల్ని సిద్ధం చేస్తోందట. ఇప్పటివరకూ వేరు. ఇకపై వేరు. సైరా రిలీజ్ కి ఇంకో రెండు నెలల సమయం పెర్ఫెక్ట్ గా ఉంది. ఈ రెండు నెలల్లో ఓ పద్ధతి ప్రకారం ప్రణాళికా బద్ధంగా ప్రచార కార్యక్రమాలు చేయనున్నారట. అందుకు చరణ్ - సురేందర్ రెడ్డి బృందం పక్కాగా ప్లాన్ రెడీ చేశారట. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ కాబట్టి.. అప్పటికి సైరా గురించి వరల్డ్ వైడ్ పాపులరాటీ తేవాలన్నది ప్లాన్.
ఈ ప్రయత్నంలో భాగంగా తొలిగా ఓ మేకింగ్ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. ఇది 100 సెకన్ల నిడివితో ఉంటుందని తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని మేకింగ్ వీడియోల్ని తదుపరి రిలీజ్ చేస్తారు. వీటితో పాటే సినిమాలో ఇప్పటికే రివీల్ కాని పలు క్యారెక్టర్లకు సంబంధించిన పోస్టర్లను రివీల్ చేస్తారు. టీజర్లు.. పాటలు.. ట్రైలర్స్ ఇలా వరుసగా మెగా ట్రీట్ ఉంటుందట. వీటన్నిటినీ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసేందుకు రామ్ చరణ్ - కొణిదెల ప్రొడక్షన్స్ సోషల్ మీడియా టీమ్ రెడీగా ఉంది. ఈ రెండు నెలలు మెగా ఫ్యాన్స్ కి మెగా ట్రీట్ అదిరిపోనుందని తెలుస్తోంది.