మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం సైరా.. నరసింహారెడ్డి. కొన్ని రోజుల పాటు జరిగిన తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తయి.. రెండు నెలలు దాటిపోయింది. ఆ తర్వాత ఈ చిత్రంపై చాలానే రూమర్స్ రాగా.. వాటన్నిటినీ సైరా టీం ఖండించింది. ఫిబ్రవరిలో రెండో షెడ్యూల్ ప్రారంభం అవుతుందంటూ ప్రకటించింది.
కానీ ఇప్పుడు సైరా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ దాదాపు నెల రోజులు వాయిదా పడినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ మంగళవారమే చిరంజీవితో సహా మొత్తం సైరా యూనిట్ అంతా కేరళకు షిఫ్ట్ అవాల్సి ఉంది. కానీ అలాంటివేమీ జరగకపోవడంతో.. సైరా షూట్ వాయిదా పడిందనే వార్తలకు ఆధారం దొరికింది. కానీ ఇది తప్పనిసరి పరిస్థితులలో చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఇందుకు కారణం.. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు. ప్రస్తుతం రంగస్థలం షూటింగ్ పూర్తి చేసిన రత్నవేలు.. ఆ మూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయాల్సి ఉంది. మార్చ్ 30న విడుదల తేదీ టార్గెట్ అందుకునేందుకు రత్నవేలు ప్రెజెన్స్ తప్పనిసరి.
అందుకే రామ్ చరణ్ సినిమా పనులను పూర్తి చేసిన తర్వాతే సైరా షూటింగ్ కు రావాల్సిందిగా సూచించారట మెగాస్టార్. అందుకే ప్రస్తుతం ఆ పనుల్లో ఉన్నాడట రత్నవేలు. అందుకే సైరా షూటింగ్ ను మార్చ్ 3వ వారానికి వాయిదా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్ కూడా మార్చ్ 20 లేదా 21 నుంచి సైరా షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది.