ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'సైరా' టీజర్ కాసేపటి క్రితం విడుదల అయింది. ఫస్ట్ షాట్ లో టాప్ యాంగిల్ లో బ్రిటిష్ కోట కు ముందు వెళ్తున్న ఎద్దుల బండ్లు చూపించారు. ఆ తర్వాత గుర్రపు బగ్గీ నుండి దిగుతున్న ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఫుట్ బోర్డు లాగా ఒక భారతీయుడి వీపుపై కాలు పెట్టి దిగడం చూపించారు. కట్ చేస్తే మెగాస్టార్ ఒక కోట పై యుద్ధవీరుడి గెటప్పులో రెండు కత్తులు వీపుకు తగిలించుకుని నిప్పుకణికలా నిలబడ్డాడు. సింబాలిక్ గా కత్తి ని ఓ కొలిమిలో ఎర్రగా కాల్చి సుత్తితో కొట్టడం.. ఆకాశంలో మెరుపులు చిరు ఇంట్రో కి స్టేజ్ సెట్ చేశారు. ఒక చేత్తో పట్టుకున్న జెండా కర్రపై ఉన్న జెండా గర్వంతో రెపరెపలాడుతూ ఉంది. ఇక స్లో గా మెగాస్టార్ గెటప్ ను రివీల్ చేశారు. మెగాస్టార్ గెటప్ అదిరిపోయిందంతే.
ఈ యుద్ధం ఎవరిదీ? అంటూ చిరు పెద్దగా అడిగితే వెంటనే అక్కడ జనాలు అందరూ 'మనదీ' అంటూ ఒకేసారి చెప్తారు. ఇక 'నరషింహా రెడ్డీ' అంటూ ఒక బ్రిటిష్ వాడు వాడి యాక్సెంట్ లో ఫ్రస్ట్రేషన్ తో అరవడం.. నెక్స్ట్ షాట్ లో చిరు చెట్లలోనుంచి గుర్రపు స్వారీ చేస్తూ బయటకు వచ్చి కత్తి బ్రిటిష్ వాళ్ళపై దూయడం. ఇక ఫైనల్ షాట్ ..తన గుర్రం ముందు కాళ్ళని అంతెత్తున పైకి లేపే స్టంట్ అన్నీ సూపర్. అసలు ఈ ఏజ్ లో చిరంజీవి ఆ స్టంట్స్ చేశాడంటే ఇక అందుకేగా ఆయన్ను 'మెగాస్టార్' అనేది అని మనకు అనిపించక మానదు.
వీటన్నిటినీ అమిత్ త్రివేది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళింది. ఆ మ్యూజిక్ కి తోడు 'ఓ ఓ సైరా.. సై సై సైరా' అంటూ సాగే హమ్మింగ్ అయితే గూస్ బంప్స్ ఇచేలా ఉంది. ఇక సినిమాటోగ్రఫి.. బ్రిటిష్ కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబించే సెట్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. చూస్తుంటే సురేందర్ రెడ్డి మెగాస్టార్ ను హీరోయిజమ్ ను పీక్ లెవెల్ కి తీసుకెళ్ళినట్టే అనిపిస్తోంది.. ఇంకెందుకు ఆలస్యం.. మళ్ళీ ఆ బ్రిటిషోడు నర్రషింహా ర్రెడ్డి అని అరిచేలోపు మీరు టీజర్ చూడండి.
వీడియో కోసం క్లిక్ చేయండి
Full View