టీజర్ - ట్రైలర్లు కట్ చేయడంలో మన వాళ్లు బాగా తెలివి మీరిపోయారు. సినిమాలో ఏదో ఉంది అనిపించే షాట్స్ తీసుకోవడం.. ఎడిటింగ్ జిమ్మిక్కులతో వాటికి అవసరం లేని బిల్డప్ జోడించడం.. కథ గురించి చెప్పీ చెప్పకుండా కన్ఫ్యూజ్ చేయడం.. ఇలా సినిమాకు హైప్ పెంచడానికి - జనాలు ఏవేవో ఊహల్లో తేలిపోవడానికి ఎన్ని ట్రిక్స్ ప్లే చేయాలో అన్నీ చేస్తున్నారు. దీని వల్ల ప్రేక్షకులు సినిమా గురించి ఏదేదో ఊహించుకుంటున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ మోతెక్కిపోతున్నాయి. తీరా ఆకాశాన్నంటే అంచనాలతో థియేటర్లకు వెళ్లి.. అక్కడ అనుకున్నంత బొమ్మ లేకపోయేసరికి తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. ఐతే ఈ అతి అంచనాలు సినిమాకు అంతిమంగా చేటు చేస్తాయనే ఆలోచన ఫిలిం మేకర్స్‌కు ఉండట్లేదు. ముందు సినిమాకు హైప్ తేవడం - ఓపెనింగ్స్ కు ఢోకా లేకుండా చూసుకోవడం మీదే వాళ్ల దృష్టి ఉంటోంది.
గత నెల చివర్లో వచ్చిన ‘సాహో’ విషయంలో అచ్చంగా ఇదే జరిగింది. ఈ సినిమాకు ప్రోమోలు కట్ చేయడంలో మాత్రం మహా తెలివి చూపించారు. కానీ ఆ నైపుణ్యం సినిమాను ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో కనిపించలేదు. భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు నిట్టూర్చారు. ‘సాహో’కు రావాల్సిన దానికంటే ఎక్కువ నెగెటివ్ టాక్ రావడానికి ఇదే కారణం. ఐతే ‘సాహో’ తర్వాత వస్తున్న భారీ చిత్రం ‘సైరా’ విషయంలో మాత్రం ఈ హడావుడి కనిపించడం లేదు. సినిమా ట్రైలర్ లో కథను పూర్తిగా విప్పేశారు. సినిమాలో ఏం చూడబోతున్నారో స్పష్టంగా చెప్పేశారు. సినిమా ముగింపు విషయంలో కూడా ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేశారు. ‘సాహో’లో మాదిరి అతి బిల్డప్ ఉన్న సన్నివేశాలు లేవు. ప్రేక్షకులు మరీ అతిగా అంచనాలు పెట్టుకోకుండా.. తాము ఏం తీశామో ట్రైలర్ తోనే దాదాపుగా ఒక అంచనాకు వచ్చేలా చేశారు. కాబట్టే ‘సాహో’ ట్రైలర్ డీసెంట్ అనిపించింది తప్ప.. ప్రేక్షకుల్లో లేనిది ఊహించుకునేలా చేసి.. అద్భుతం అమోఘం అనిపించేయలేదు. చిరు సినిమా కాబట్టి ఆటోమేటిగ్గా రావాల్సిన హైప్ వస్తుంది. అంతకుమించి అంచనాలు పెంచాల్సిన అవసరం లేదని చిత్ర బృందం తెలివిగానే ఆలోచించింది. రేప్పొద్దున సినిమా ప్రేక్షకులు అనుకున్న దాని కంటే బాగుంటే - ట్రైలర్లో చూపించిన వాటికంటే మెరుగైన మూమెంట్స్ ఉంటే సినిమాకు ఇంకా ప్లస్సే తప్ప మైనస్ కాదు.