మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 151వ చిత్రం `సైరా-నరసింహారెడ్డి`. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై రామ్ చరణ్ ఈ భారీ హిస్టారికల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అసాధారణ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని మేకర్స్ ఇప్పటికే తెలిపారు. ఈ సినిమా పోస్టర్లు-టీజర్- మేకింగ్ వీడియో సినిమాపై భారీ అంచనాల్ని పెంచాయి. ఇటీవలే రిలీజైన మేకింగ్ వీడియోతోనే కంటెంట్ పరంగా భారీతనం అందరికీ అర్థమైంది. సాహో తర్వాత అంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారన్న ప్రశంసలు దక్కాయి.
తాజాగా సైరా టీజర్ రిలీజైంది. టీజర్ ఆద్యంతం గ్రిప్పింగ్ వారియర్ డ్రామా రక్తి కట్టించింది. ఒక వీరుని చరిత్రను హాలీవుడ్ స్టాండార్డ్స్ లో కళ్లకు గట్టేలా తీర్చిదిద్దారని టీజర్ చెబుతోంది. ``చరిత్ర స్మరించుకుంటుంది. ఝాన్సీ లక్ష్మీ భాయ్.. చంద్రశేఖర్ అజాద్- భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణత్యాగాల్ని. కానీ ఆ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు. ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధభేరి మోగించిన రేనాటి సూర్యడు`` అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో టీజర్ మొదలవుతుంది. విజువల్స్ ఆద్యంతం ప్రతి ఫ్రేమ్ లో భారీ కోటలు గడీలు .. ప్రకారాలు చూడగానే భీకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఆంగ్లేయుల గుండెల్ని చీల్చుతూ కత్తి దూస్తున్న సైరా నరసింహుని స్పీడ్ ఆ పాత్ర వీరత్వాన్ని ఎలివేట్ చేసింది. ``సింహం లాంటోడు దొర. అతడే వాళ్ల ధైర్యం దొరా!`` అంటూ నరసింహారెడ్డి పాత్ర గొప్పతనాన్ని ఎలివేట్ చేశారు.
``రేనాటి వీరులారా..! చరిత్రలో మనం ఉండకపోవచ్చు. కానీ చరిత్ర ఈరోజు మనతోనే మొదలవ్వాలి!`` అంటూ టీజర్ లో వినిపించే మెగాస్టార్ గంభీరమైన స్వరం మెగాభిమానులకు స్పెషల్ ట్రీట్ అనే చెప్పాలి. ముఖ్యంగా వార్ సీక్వెన్సుల్లో మెగాస్టార్ చిరంజీవి పెర్ఫెక్షన్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. 60 ప్లస్ వయసులోనూ ఆయన సింహంలా గర్జించిన తీరు ఆశ్చర్యపరుస్తుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు ఆయన తప్ప వేరొకరు సూట్ కారేమో! అన్నంతగా ఒదిగిపోయి నటించారు. ఇక ఈ సినిమా లుక్ ఒక ట్రాయ్ రేంజు.. ఒక గ్లాడియేటర్ రేంజు అన్నంతగా విజువల్స్ కట్టి పడేశాయి. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో ఒక టాలీవుడ్ సినిమా వస్తోందన్న భరోసాని విజువల్స్ ఇచ్చాయని చెప్పాలి. ఆగస్టు 30న సాహో లాంటి టెక్నికల్ వండర్ రిలీజవుతోంది. ఆ సినిమా వచ్చిన మరో నెలరోజుల్లనే అంటే అక్టోబర్ 2న సైరా రిలీజవుతోంది. అంటే నెలరోజుల గ్యాప్ లోనూ రెండు విజువల్ వండర్స్ ని వీక్షించే వీలుందని చెప్పొచ్చు.
Full View