రాంబోకూ తప్పని చావుకబురు సందడి!

Update: 2016-09-06 07:27 GMT
చాలా సందర్భాల్లో కాస్త పెద్ద వయసు వచ్చినా లేక రెగ్యులర్ గా కనిపించడం మానేసిన - ఎవరై సెలబ్రెటీలు అనారోగ్యంతో ఉన్నా వెంటనే మీడియాలో స్క్రోలింగ్స్ మొదలైపోతుంటాయి. ఒక సాడ్ బ్యాగ్రౌండ్ సాంగ్ తో స్పెషల్ ప్రోగ్రాం నడుస్తుంటుంది. ఇవి రెగ్యులర్ గా జరిగే కార్యక్రమాలు అయిపోతున్నాయి. ఈ విషయంలో సోషల్ మీడియా కూడా ఫుల్ యాక్టివ్ పార్ట్ తీసుకుంటుంది. దున్నపోతు ఈనిందంటే.. తీసుకెళ్లి కట్టెయ్యి అనే చందంగా కొందరు వ్యవహరిస్తుంటారు. వెంటనే ఒక ఫోటోపెట్టి "ఆర్.ఐ.పి" అని టైం చేసి షేర్ చేసేస్తుంటారు. తాజాగా హాలీవుడ్ సూపర్ స్టార్ విషయంలో కూడా ఇలానే జరిగింది. ఈ విషయంపై స్వయంగా ఆయనే విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది.. అయినా కూడా ఈ "రిప్" బాద తప్పడంలెదు!

"నేను ఇంకా బతికే ఉన్నాను - నాపై దయచేసి ఇలాంటి వదంతులు ప్రచారం చేయొద్దు" అని హాలీవుడ్ సూపర్ స్టార్ సిల్వెస్టర్ స్టాలోన్ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తిచేశాడు. గతవారం సిల్వెస్టర్ స్టాలోన్ చనిపోయాడన్న వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. 'రాంబో' మూవీస్ సిరీస్ లో స్టాలోన్ తీసిన సినిమాలు చూసి ఎంతో మంది ఆయనకు అభిమానులుగా మారిపోవడంతోపాటు వారంతా ముద్దుగా రాంబో అనే పిలుచుకుంటారు. దీంతో ఎవరో ఆకతాయి.. "రాంబో చనిపోయారు" అని ప్రచారం చేశాడు.

ఈ విషయాలపై స్పందించిన రాంబో.. తన కూతురు సోఫియా స్టాలోన్ తో కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. అయినా కూడా ఆయనపై ఈ దుష్ప్రచారం ఏమాత్రం తగ్గలేదు. మరోసారి రాంబో చనిపోయాడని కొందరు లేటెస్ట్ గా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ విషయంపై ఆయన అభిమానులు స్పందిస్తూ... ఆయన చనిపోయాడన్న వార్త నిజం కాదని.. ఇలాంటి వార్తలను ప్రచారం చేయోద్దని మండిపడుతున్నారు.. అర్ధంచేసుకోండి బాస్... ఇలాంటివి ఆపెయ్యండి!!
Tags:    

Similar News