బేబి.. అందితే జుత్తు లేకపోతే కాళ్ళా??

Update: 2017-05-25 05:23 GMT

తెలుగు లో కొద్ది కాలం కిందట సొట్ట బుగ్గల సుందరి తాప్సీ ఓ స్టార్ అలా వెలిగి పోయింది. కానీ సినిమాలు హిట్ కాకపోవడంతో తమిళంకు వెళ్లవలిసి వచ్చింది. అక్కడ కూడా చెప్పుకోదగ్గ పేరు రాకపోయినా  సినిమాలు బాగానే ఆడాయ్.. కానీ అన్నీ గ్లామర్ రోల్స మాత్రమే వస్తున్నాయి. దీనితో కాస్త నిరాశ చెంది బాలీవుడ్ కి వెళ్లింది తాప్సీ. అక్కడ పింక్ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. దాని వెంటనే వచ్చిన నామ్ షబానా ఆశించిన ఫలితం ఇవ్వలేదు.

పింక్ సినిమాతో నేను మంచి నటిని అని చెప్పుకు తిరుగుతున్న తాప్సీ కి  నామ్ షబానాతో పెద్ద షాక్ తగిలింది. దీనితో అక్కడ ఎవరు తాప్సీ ని లీడ్ హీరోయిన్ గా చూడటం లేదు దానితో అవకాశాలు కూడా  ఏమి రావటంలేదు. అప్పటికంటే ముందు సైన్ చేసిన జుడ్వా రీమేక్ తప్పితే ఇంకోటి చేతిలో లేదు. సౌత్ సినిమాలలో హీరోయిన్ కేవలం గ్లామర్‌ పాత్రలకే పరిమితం చేస్తారుని ఒక హింది ఇంటర్వ్యూలో ఆ మధ్యన తాప్సీ నిప్పులు చెలరేగింది. అలా చెప్పిన ఈ పింక్ గర్ల్ ఇప్పుడు మళ్ళీ ఒక తెలుగు సినిమా చేయడానికి సిద్దపడింది. సుధీర్‌ బాబు హీరోగా చేస్తున్న ఒక హారర్‌ కామెడీ ‘ఆనందో బ్రహ్మ’ చిత్రంతో తాప్సీ తిరిగి తెలుగు ఇండస్ట్రీలో నటిస్తుంది. ఈ పాత్ర కూడా మన తెలుగు హీరోయిన్ గ్లామర్ పాత్రే. ఆమె నటించిన గత చిత్రం గంగ కూడా హారర్‌ కామెడీనే.

ఫిమేల్ క్యారెక్టర్‌ స్ట్రాంగ్ గా ఉన్న స్క్రిప్ట్ లు అంతా తరుచుగా రావు మన ఇండస్ట్రిలో. మరి అటువంటి అప్పుడు నేను ఇలాంటివే చేస్తా అని మడి కట్టుకొని కూర్చుంటే ఆ కాస్త అవకాశాలు కూడా పోతాయి అని చేస్తునట్లు ఉంది. లేక అక్కడ ఏదైనా సినిమా కు ఓకే చెప్పి టైమ్ వేస్ట్ చెయ్యడం ఎందుకని చేస్తుందో ఇప్పుడు అప్పుడే  తెలియదు. మళ్ళీ ఏదైనా బాలీవుడ్ ఆఫర్ వస్తే తెలుగులో  నా స్థాయి సినిమాలు లేవు అందుకే చేయటం లేదు అని చెబుతుంది ఏమో ఈ సొట్ట బుగ్గల సుందరి. అందితే జుత్తు అందకుంటే కాళ్ళు అన్నట్లుంది బేబి పరిస్థితి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News