ఢిల్లీలో దారుణం అంటున్న తాప్సీ

Update: 2016-09-16 15:30 GMT
ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను ఇప్పుడు బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకుంటోంది. పింక్ మూవీతో అమితాబ్ తో కలిసి కనిపించగా.. ఇప్పుడీ మూవీ ప్రమోషన్స్ లో తెగ బిజీగా ఉంది తాప్సీ. అయితే.. ఈ భామలో ట్యాలెంట్ ఎంత ఉందో.. మాటల్లో కూడా అంత ఆవేశం కనిపిస్తోంది. కష్టపడి పైకొచ్చాననే ఫీలింగ్ ఈమె మాటల్లో తెలిసిపోతూనే ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈవ్-టీజింగ్ కాన్సెప్ట్ చుట్టూ పింక్ మూవీ స్టోరీ నడవగా.. రియల్ లైఫ్ లో తాను కూడా ఈ ఇబ్బంది ఎదుర్కున్నట్లు చెబుతోంది తాప్సీ.

ఢిల్లీలో తాను నివసించే సమయంలో.. రోజూ ఇబ్బందికి గురయ్యేదట ఈ బ్యూటీ. ఈవ్ టీజింగ్.. హరాస్మెంట్ లు ఇక్కడ డైలీ రొటీన్ లైఫ్ లో పార్ట్ అని.. రద్దీ ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ వేయడం.. వేధింపులకు గురి చేయడం.. ఢిల్లీలో నిత్యకృత్యం అంటోంది తాప్సీ. గతంలో తాను కాలేజ్ కి వెళ్లేటపుడు ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొషన్ బస్సుల్లో వెళ్లేదాన్నని.. ఆ రోజుల్లో ప్రతీ రోజు తనను ఎక్కడెక్కడో చేతులు వేసి ఇబ్బంది పెట్టేవారని చెప్పింది తాప్సీ పన్ను.

ఇక పండుగల్లాంటి సందర్భాల్లో అయితే.. జన సమ్మర్దం ఉన్న ప్లేస్ లలో ఈ తతంగం మరింత ఎక్కువగా ఉంటుందని తాప్సీ అంటోంది. అమ్మాయిలను ఇలా వేధింపులకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నది తాప్సీ డిమాండ్. ప్రస్తుతం ఆమె నటించిన 'పింక్' సినిమా కూడా ఇదే కాన్సెప్టుతో తెరకెక్కిందిలే. ఈ సినిమాలో తాప్సీ నటన అసమానం అంటూ అందరూ పొగిడేస్తున్నారు.
Tags:    

Similar News