ప్రేమించా.. ప్రేమిస్తున్నా..

Update: 2017-05-07 10:47 GMT
నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని అడిగితే అవుననో... కాదనో సమాధానం చెబుతారు. లేదంటే సమాధానం దాటేస్తారు. పంజాబ్ నుంచి తెలుగుకొచ్చి ఇక్కడ కొన్నాళ్లపాటు తన అందాలతో కనువిందు చేసి ఇప్పడు బాలీవుడ్ కు వెళ్లిన తాప్సీ మాత్రం తాను ప్రేమించానని.. అదీ ఎనిమిదేళ్ల వయసులోనే ప్రేమించానంటూ చెబుతోంది. కానీ తాను ప్రేమించిది బాయ్ ఫ్రెండ్ ని కాదంటూ మెలిక పెట్టింది.

తాను ఎనిమిదేళ్ల వయసులో ప్రేమించింది నాట్యాన్ని అని.. అప్పటి నుంచి ఇప్పటివరకు నాట్యాన్ని ప్రేమిస్తూనే ఉన్నానని చెబుతోంది. ఇండస్ర్టీలో అందరితోనూ తాను ప్రేమగానే ఉంటానని... అయితే ఇది అందరూ అనుకునే ప్రేమకాదని అంటోంది. అదంతా వృత్తిపరమైన ప్రేమేనని అంటోంది.  టాలీవుడ్ లో ప్రస్తుతం తాప్పీ చేస్తున్న సినిమాలు ఏమీ లేకపోయినా బాలీవుడ్ లో మాత్రం బాగానే అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయి. రాణా హీరోగా నటించిన ఘాజీలో చిన్న పాత్రలోనే కనిపించినా.. నామ్ షబానా మాత్రం బాలీవుడ్ లో మంచి పేరే తెచ్చిపెట్టింది.

జీవితంలో తాను అత్యధికంగా ప్రేమించిన వ్యక్తి ఒకరున్నారని, అది వేరెవరో కాదు తనేనని తాప్సి కొత్త ట్టిస్టిచ్చింది. కొంపదీసి ఆ మధ్య వచ్చిన రవితేజ సినిమా కిక్-2 సినిమా తెగ చూసేసిందా ఏమిటి?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News