తాప్సీ మ‌రో ప్ర‌యోగం స‌క్సెస్సేనా?

Update: 2018-08-03 04:15 GMT
రొటీన్ మ‌సాలా సినిమాల‌తో వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన తాప్సీ ప్ర‌స్తుతం గేర్ మార్చి కొత్త రూట్‌ లో వెళుతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ కి వెళ్లాక అన్నీ ప్ర‌యోగాలే. పింక్‌ - నామ్ ష‌బానా చిత్రాల‌తో అక్క‌డ చ‌క్క‌ని న‌టి అన్న పేరు తెచ్చుకుంది. నామ్ ష‌బానాలో మార్ష‌ల్ ఆర్ట్స్ క్వీన్‌ గా క‌నిపించింది. ఆడ‌వారిలో ఆత్మ‌విశ్వాసం నేప‌థ్యంలో క‌థ‌ల్ని ఎంచుకుని తాప్సీ న‌టించ‌డం త‌న‌కు ఓ ర‌కంగా క‌లిసొచ్చింది. తాప్సీ స్ఫూర్తితో గాళ్స్‌ లోనూ ఓ ర‌కమైన విప్ల‌వం వచ్చిందంటే అతిశ‌యోక్తి కాదు.

అయితే పింక్ త‌ర్వాత నామ్ ష‌బానా బాక్సాఫీస్ రిజ‌ల్ట్ ప‌రంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవ‌డం మైన‌స్ అయ్యింది. ఆ క్ర‌మంలోనే రీసెంటుగానే వ‌రుణ్ ధావ‌న్ స‌ర‌స‌న `జుడ్వా 2` చిత్రంతో మ‌రో బంప‌ర్‌ హిట్ అందుకుని తిరిగి ట్రాక్‌ లోకి వ‌చ్చింది. జుడ్వా 2లో తాప్సీ న‌ట‌న‌కు మంచి మార్కులే వేశారు క్రిటిక్స్‌. అదంతా అటుంచితే తాప్సీ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న `ముల్క్‌` ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. నిన్న‌టి సాయంత్రం నుంచే ప్రివ్యూల సంద‌డి నెల‌కొంది. ఇప్ప‌టికే వెబ్‌ లో రేటింగుల‌తో రివ్యూలు వ‌చ్చేశాయి. అసుల‌ ఈ సినిమా రిజ‌ల్ట్ ఏంటి? అంటే...

పింక్ త‌ర్వాత మ‌ళ్లీ క్రిటిక్స్ నుంచి ఓ రేంజులో ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది ఈ చిత్రం. ముల్క్ కి భారీ రేటింగులు ఇచ్చిన విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లు కురిపించారు. లాయ‌ర్ పాత్ర‌లో న‌టించిన తాప్సీ పెర్ఫామెన్స్‌ కి చ‌క్క‌ని మార్కులేశారు. హార్డ్ హిట్టింగ్ కంటెంట్ డ్రివెన్ బోల్డ్ ఎటెంప్ట్ ఇది. బ‌ల‌మైన డ్రామా - ప‌వ‌ర్ ప్యాక్డ్ డైలాగులు ప్ల‌స్‌. అనుభ‌వ్ సిన్హా స‌రైన క‌థ‌తో ఈ సినిమా చేశారు. కొన్ని అసౌక‌ర్య‌మైన ప్ర‌శ్న‌లు ఇబ్బంది పెట్టినా చూడ‌ద‌గ్గ చిత్ర‌మిది.. అని ప్ర‌ఖ్యాత క్రిటిక్ త‌రణ్ ఆద‌ర్శ్ ప్ర‌శంసించారు. మొత్తానికి పాజిటివ్ నోట్‌ తో తాప్సీ ఖుషీ అయిన‌ట్టే. ఇక సోమ‌వారానికి `ముల్క్‌` బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటి? అన్న‌ది తేల‌నుంది.
Tags:    

Similar News