ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను టాలీవుడ్ మూవీ ఝుమ్మంది నాదంతో వెండి తెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తమిళ్.. మలయాళంలో కూడా ట్రయల్స్ వేసింది కానీ.. అవకాశాలు ఇచ్చినది మాత్రం తెలుగు సినిమాలే. ఐదేళ్ల పాటు నానా పాట్లు పడ్డాక.. చివరకు కాంచన2 తో తమిళంలో బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ నుంచి పిలుపు రావడం.. పింక్ అంటూ ప్రశంసలు అందుకోవడంతో.. అదంతా తన క్రెడిట్ మాత్రమే అని ఫిక్స్ అయిపోయి.. తెలుగు సినిమాలపై.. సౌత్ ఇండస్ట్రీపై సెటైర్లు వేసేసింది.
అంతలో నామ్ షబానా మూవీని తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తామని ప్రొడ్యూసర్స్ చెప్పేపాటికి.. తెలుగంటే నాకు భలే ఇష్టం అంటూ మడతేసే ప్రయత్నం చేసింది కానీ.. పలు కారణాలతో నామ్ షబానా తెలుగు డబ్బింగ్ వెర్షన్ నేనే షబానా విడుదల కాలేదు. టైటిల్ కూడా మారలేదు కాబట్టి.. సెపరేట్ సెన్సార్ కూడా అవసరం లేని ఈ చిత్రం.. రిలీజ్ ఆగిపోయింది. ఓ వారం ఏప్రిల్ 7న తెరపైకి తెద్దామని భావించారు కానీ.. ఇప్పుడా ప్రయత్నం కూడా విరమించేసుకున్నారట.
హిందీ వెర్షన్ కు వచ్చిన టాక్ చూసి.. ఓ వారం తర్వాత తెలుగు వెర్షన్ విడుదల చేసినా చేయకున్నా ఒకటే అని ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది. రిలీజ్ చేసి నవ్వుల పాలు అయ్యే బదులు.. అసలు విడుదల చేయకుండా సైలెంట్ గా ఉండిపోవాలని ఫిక్స్ అయిపోయారటట. అలా తాప్సీ డబ్బింగ్ బొమ్మ తెలుగు తెరపైకి రావడమే ఆగిపోయింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/