దేనికైనా పంచ్ వేస్తుందని నిరూపించిందిగా!

Update: 2019-06-04 01:30 GMT
తాప్సీ పన్ను మొదట్లో టాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించి ఆ తర్వాతే బాలీవుడ్ కు మకాం మార్చింది.  లక్కీగా బాలీవుడ్ లో తనకు బ్రేక్ త్వరగానే వచ్చింది.  'పింక్' సినిమాతో తనను తాను మంచి నటిగా ప్రూవ్ చేసుకుంది. ఇక 'సూర్మా'.. 'ముల్క్'.. 'మన్మర్జియా'.. 'బద్లా' లాంటి సినిమాలతో బాలీవుడ్ లో మంచి మార్కెట్ సంపాదించుకుంది.  రియల్ లైఫ్ లో కూడా తాప్సీ డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంటుంది. ఎవరైనా సోషల్ మీడియాలో కనుక ట్రోల్ చేస్తే గట్టిగా కౌంటర్ ఇస్తుంది. ఒక్కోసారి నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను చెప్పేస్తుంది.

తాజాగా అలాంటి సందర్భమే మరోసారి వచ్చింది. ఒక నెటిజన్ తాప్సీని పొగుడుతూ "ఈమధ్యే మీరు నటించిన 'బద్లా' సినిమాను నా మొబైల్ ఫోన్ లో చూశాను.  మీరు చాలా టాలెంటెడ్.  కానీ మీరు చాలా అండర్ రేటెడ్ యాక్ట్రెస్.  మీకు తగిన గుర్తింపు రాలేదు" అన్నాడు.  దీనికి సమాధానంగా తాప్సీ "మిగతా హీరోయిన్లలాగా నేను ఆకర్షణీయంగా లేకపోతే మీరు థియేటర్ కు వెళ్ళి సినిమా చూడండి. అప్పుడు నా రేటింగ్ మెరుగఅయ్యే అవకాశం ఉంది" అంటూ పంచ్ వేసింది.  నిజానికి ఆ నెటిజన్ తాప్సీని ప్రశంసించాడు. కానీ తాప్సీ మాత్రం "ఫోన్ లో సినిమా చూసి నన్ను పొగిడితే ఏం ప్రయోజనం.. అదే థియేటర్ కు వెళ్ళి సినిమా చూస్తే కదా కలెక్షన్స్ పెరిగేది. నాకు మంచి పేరు వచ్చేది" అన్నట్టుగా సాఫ్ట్ గా కౌంటర్ ఇచ్చింది.

ఏదైతేనేం.. ఒకటి మాత్రం కన్ఫాం. తాప్సీ అందరి లాంటి నటి కాదు. సంథింగ్ స్పెషల్.  అందుకే తన మాటల్లో కూడా ఆ ప్రత్యేకత కనిపించేలా ప్రవర్తిస్తుంది.  ఇక తాప్సీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే త్వరలో 'గేమ్ ఓవర్' రిలీజ్ కానుంది.  ఈ సినిమా కాకుండా హిందీ లో 'తడ్కా'.. 'మిషన్ మంగల్'.. 'సాంద్ కీ ఆఖ్' అనే సినిమాల్లో నటిస్తోంది.

   

Tags:    

Similar News