ఈ లేటు వ‌య‌సు భామ్మ ఎవ‌రు?

Update: 2019-07-08 15:58 GMT
బాలీవుడ్ లో తాప్సీ జోరు గురించి తెలిసిందే. వ‌రుస‌గా ఆఫ్ బీట్ క‌థాంశాల్ని ఎంచుకుని న‌టిగా స‌త్తా చాటుతోంది. ఇటీవ‌లే `గేమ్ ఓవ‌ర్` అంటూ ప్ర‌యోగాత్మ‌క చిత్రంతో ఆకట్టుకుంది. చ‌క్రాల కుర్చీకి అంకిత‌మ‌య్యే యువ‌తిగా తాప్సీ అద్భుతంగా న‌టించింద‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఈ సినిమా త‌ర్వాతా  తాప్సీ వ‌రుస‌గా ప్ర‌యోగాల‌కు సిద్ధ‌మ‌వుతోంది. తాజాగా లేటు వ‌య‌సు భామ్మ‌గా తాప్సీ స‌ర్ ప్రైజ్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

లేటు వ‌య‌సు షూట‌ర్ దాదీస్‌ గా పాపుల‌రైన చంద్రో తోమ‌ర్ (87) - ప్ర‌కాషి తోమ‌ర్ (82) రియ‌ల్ లైఫ్ క‌థ‌లో తాప్సీ- భూమి ఫెడ్నేక‌ర్ న‌టిస్తున్నారు. `సాంద్ కి ఆంఖ్` అనేది టైటిల్. తుషార్ హిరానందాని ద‌ర్శ‌కుడు. అనురాగ్ క‌శ్య‌ప్ నిర్మాత‌. 50ల‌లో షార్ప్ షూట‌ర్స్ గా స‌త్తా చాటిన సిస్ట‌ర్స్ క‌థ‌తో ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్ర‌మిది. ఇప్ప‌టికే షూట‌ర్ దాదీస్ గా తాప్సీ- భూమి లుక్ రిలీజైంది. ఈ పోస్ట‌ర్ల‌లో తాప్సీ వృద్ధ గెట‌ప్ చూసి అభిమానులు షాక్ తింటున్నారు.

ఇటీవ‌ల వ‌రుస‌గా ఆన్ లొకేష‌న్ స్టిల్స్ ని సామాజిక మాధ్య‌మాల్లో రివీల్ చేస్తూ తాప్సీ- భూమి ఫెడ్నేక‌ర్ ప్ర‌చారంలో వేగం పెంచారు. ఫ్యాన్స్ ని టీజ్ చేస్తూ స‌గం క‌నిపించ‌కుండా ఉండే లుక్స్ ని రివీల్ చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. తాజాగా మ‌రో స్టిల్ ని తాప్సీ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో ప‌సుపు- కాషాయ వ‌ర్ణం చీర‌లో క‌నిపించింది. నెరిసిన జుత్తు.. ముఖంపై ముడుత‌లతో పూర్తిగా ప్రోస్థ‌టిక్స్ లో తాప్సీ రూప‌మే మారిపోయింది. ఇలాంటి ప్ర‌యోగాత్మ‌క‌ పాత్ర‌లో న‌టించే సాహ‌సం చేయ‌డాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. దీపావ‌ళికి ఈ సినిమాని రిలీజ్ చేయ‌నున్నారు. తోమ‌ర్ సిస్ట‌ర్స్ ఉత్త‌ర ప్ర‌దేశ్ జోహ్రి అనే విలేజ్ లో జ‌న్మించి షార్ప్ షూటర్స్ గా ఎద‌గ‌డం ఓ సంచ‌ల‌నం. వారి జీవిత‌క‌థ‌ను తెర‌పై ఆవిష్క‌రిస్తుండ‌డంతో ఫ్యాన్స్ లో ఉత్కంఠ నెల‌కొంది.

ఇక ఓల్డ్ గెట‌ప్పుల‌తో మ‌న క‌థానాయిక‌ల ప్ర‌యోగాత్మ‌క ధోర‌ణి ఆక‌ర్షిస్తోంది. 70 వ‌య‌సు భామ్మ 25 వ‌య‌సుకు షిఫ్ట‌యితే ఏం జ‌రిగింది? అన్న క‌థ‌తో సామ్ `ఓ బేబి` తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇందులో ఎక్క‌డా స‌మంత ఓల్డ్ గెట‌ప్ లో క‌నిపించ‌దు. అయినా వృద్ధురాలి ఫీలింగ్స్ ని ప‌లికిస్తూ స‌మంత ఆక‌ట్టుకున్న తీరుకు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇక తాప్సీ పూర్తిగా ఓల్డ్ ఉమెన్ గానే క‌నిపిస్తూ ఎలాంటి పెర్ఫామెన్స్ ఇవ్వ‌నుందో చూడాలి.


Tags:    

Similar News