టాలీవుడ్ కు పరిచయమైన నటీమణులు ఎందరో ఉన్నా.. వారికి భిన్నమైన టాలెంట్ మాత్రమే కాదు.. తన మాటలతోనూ.. చేతలతోనూ భిన్నంగా వ్యవహరించటం ఆమెకు అలవాటు. ప్రశ్న ఎంత సూటిదైనా.. పక్కకు తప్పుకోకుండా అంతే సూటిగా చెప్పేసే విలక్షణత తాప్సీ సొంతం. తెలుగులో స్టార్ హీరోయిన్ కోసం సీరియస్ గా ట్రై చేసినప్పటికీ సాధ్యం కాలేదు. అయితే.. అందుకు భిన్నంగా బాలీవుడ్ లో నటకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్ని పోషిస్తూ.. తాప్సీ సమ్ థింగ్ ఢిఫరెంట్ బాస్ అన్న ఇమేజ్ ను సొంతం చేసుకోగలిగింది.
తనకు కోపం వస్తే.. ఎదుటివారు ఎవరు? అన్న విషయాల్ని అస్సలు చూసుకోదు తాప్పీ. అందునా.. తన తప్పు లేదని ఫిక్స్ అయితే చాలు.. చెలరేగిపోతారన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఆ మధ్యన ప్రముఖ నటుడు బిగ్ బితో కలిసి చేసిన బద్లా మూవీలో ఆయనపై విమర్శలు చేయటం ద్వారా తాప్సీ సంచలనంగా మారారు.
ప్రముఖ నటుడ్ని అంతలా ఎలా విమర్శిస్తారన్నది ప్రశ్న. అదే మాటను తాప్సీని అడిగితే.. స్ట్రెయిట్ గా పాయింట్ లోకి వచ్చేశారు. తానేమీ అమితాబ్ ను వ్యక్తిగతంగా విమర్శించలేదని.. పని కట్టుకొని తప్పు పట్టలేదన్న విషయాన్ని స్పష్టం చేశారు. బద్లా సినిమాలో తన పాత్ర నిడివి తక్కువేం కాదని.. చాలా సన్నివేశాల్ని కనిపిస్తానని.. అయినప్పటికీ అది అమితాబ్ సినిమాలా చూపించారే కానీ తనకు సినిమా ప్రచార పోస్టర్లలో ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు.
ఇదే విషయాన్ని తాను లేవనెత్తానని.. విమర్శలు చేశానే తప్పించి.. అమితాబ్ మీద తనకు ఎలాంటి కోపం లేదన్నారు. తాను అభిమానించే వ్యక్తుల్లో అమితాబ్ ఎల్లప్పుడూ ముందే ఉంటారని పేర్కొన్నారు. ఏమైనా.. ప్రశ్న ఏదైనా మొహమాటం లేకుండా సమాధానం చెప్పేయటంలో తాప్సీ తర్వాతే ఎవరైనా అని చెప్పక తప్పదు.